Breaking News

'స్త్రీ' నిర్వచనం ఇదా..? ఎలాన్‌మస్క్‌పై నెటిజన్లు ఫైర్‌

Published on Sun, 12/14/2025 - 12:53

స్త్రీత్వంపై ప్రపంచ కుభేరుడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వివాదాస్పదంగా మారి తీవ్ర దుమారం రేపాయి. అంత స్థాయిలో ఉన్న వ్యక్తి కాస్త దిగజారుడు వ్యాఖ్యలు చేయడంపై సర్వత్ర ఆగ్రహం వ్యక్తమైంది. పోనీ సైంటిఫిక్‌గా చెప్పని అందరికి సమంజసంగా ఉండేలా మాట్లాడాలి గానీ మరి ఇలానా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు. 

ఇంతకీ ఆయన ఏమన్నారంటే..టెస్లా, స్సేస్‌ ఎక్స్‌ దిగ్గజం ఎలోన్‌ మస్స్‌ స్త్రీత్వంపై తన అభిప్రాయలను పంచుకోవడం వివాదాస్పదంగా మారింది. సోషల్‌ మీడియాలో ఆయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శులు వెల్లువెత్తాయి. మస్క్‌ స్త్రీకి నిర్వచనం గర్భం అంటూ గర్భాశయం ఉన్నవాళ్లను స్త్రీలుగా వ్యవహరిస్తారని, గర్భం ఉనికి ద్వారా స్త్రీని నిర్వచించాలి అని నొక్కి చెప్పాడంతో ఒ‍క్కసారివ ఆయనపై తారాస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన వైఖరిని చాలామంది ఖండించారు. 

అంతేగాదు అస్సలు మనం ఇంకా ఏ కాలంలో  జీవిస్తున్నాం అని విమర్శిస్తూ పోస్టులు వెల్లువెత్తాయి. గర్భం ఉంటే స్త్రీ అంటే.. మరి ఎంఆర్‌కేహెచ్‌ సిండ్రోమ్‌ మేయర్-రోకిటాన్స్కీ-కస్టర్-హౌసర్ సిండ్రోమ్) అరుదైన పరిస్థితితో బాధపడుతున్న ఆడవాళ్లు..స్త్రీలు కాకుండా పోతారా అని నిలదీశారు. ఎంఆర్‌కేహెచ్‌ సిండ్రోమ్‌ అంటే గర్భాశయం లేకుండా లేదా అభివృద్ధి చెందని స్త్రీలని అర్థం. 

లింగ మార్పిడిని బహిరంగంగా వ్యతిరేకిస్తూ  తన ట్రాన్స్‌జెండర్‌ కుమార్తె పరిస్థితిని  "విషాదకరమైన మానసిక అనారోగ్యం"గా అభివర్ణించారు. ఆయన తనను లక్ష్యంగా చేసుకుని డెమొక్రాట్‌ అభ్యర్థి కాలిఫోర్నియా గవర్నర్‌ గవిన్‌ న్యూసమ్‌ చేసిన వ్యాఖ్యలకు మస్క్‌ ఇలా ప్రతిస్పందించారు.  

కాగా, కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ పాడ్‌కాస్టర్‌తో తాను ఎక్కువ మంది ట్రాన్స్ పిల్లలను చూడాలనుకుంటున్నానని, తనను తాను ట్రాన్స్-ప్రో చట్టం LGBTQ హక్కుల బలమైన మద్దతుదారుగా భావిస్తానని చెప్పారు. అంతేగాదు సారీ మస్క్‌ మిమ్మల్ని మీ కూతురు ద్వేషిస్తున్నందుకు అని నేరుగా సెటైర్‌ వేశారు. దాంతో మస్క్‌ ఇలా విరుచుకుపడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. 

 

(చదవండి:  ఔనా ..! ఏకంగా 66 శాతం మగజాతి రాముడిలా ఏకపత్నీవ్రతులా! సర్వేలో షాకింగ్‌ విషయాలు)
 

Videos

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)