Breaking News

భారీ బంగారు జుంకాలు..ఏకంగా 5,840 గంటలు, 55 మంది..

Published on Sun, 10/25/2026 - 11:39

బంగారం ధరలు ప్రస్తుతం ఆకాశాన్ని తాకేలా పలుకుతున్నాయి. ఈ తరుణంలో రెండు భారీ చెవిపోగులు పెద్ద సెన్సేషన్‌ని క్రియేట్‌ చేశాయి. చేతితో రూపొందించిన చెవిపోగులు రెండు గిన్నిస్‌ ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది. ఆ చెవిపోగుల్లో స్పెషాల్టీ తెలిస్తే..విస్తుపోవాల్సిందే. ఇవేమి ఆషామాషి చెవిపోగులు కాదు. సుమారు 16 కేజీలకు పైగా బరువున్న ఒక జత భారీ బంగారు జుంకాలు. ప్రముఖ జాయలుక్కాస్‌ జ్యువెలరీ సంస్థ రూపొందించిన ఈ చెవిపోగులును స్వయంగా చేతితో డిజైన్‌ చేసినవి. 

ప్రపంచంలోనే అత్యంత బరువైన అతిపెద్ద బంగారు చెవిపోగులు. ఈ చెవిపోగులను వెయ్యి నెమళ్లు అని అర్థం వచ్చేలా మయూర సహస్ర ఝుంకాలు అని పిలుస్తారు. దాదాపు 22 క్యారెట్ల బంగారు చెవిపోగులు ఇవి. ఇటీవలే అక్టోబర్‌ 24న దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్‌లోని జ్యువెల్ ఆఫ్ జాయ్ షోరూమ్‌లో యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రి ఆవిష్కరించారు. దీన్ని సుమారు 55 మంది కళాకారులు దాదాపు  5,840 గంటలు వెచ్చించి మరి డిజైన్‌ చేశారట. భారతీయ సంస్కృతిలో సౌందర్యానికి, హుందాతనానికి ప్రతీక అయిన నెమలి, దక్షిణాసియా వివాహాల్లో సాధారణంగా ధరించే సాంప్రదాయ గంట ఆకారం తదితరాలను ప్రేరణగా చేసుకుని డిజైన్‌ చేశారు. 

ఈ ఝమ్కాల తయారీ వెనుకున్న స్ఫూర్తి గురించి జాయలుక్కాస్‌ సీఈవో ఇలా వివరించారు. దుబాయ్‌ను ఎప్పుడూ బంగారు నగరం అని పిలుస్తారు. ఈ బంగారు చెవిపోగులు ఆ పేరుకు మరింత వన్నె తెస్తాయి. దీని క్రెడిట్‌ మొత్తం దుబాయ్‌కి, అలాగే రూపొందించిన కళకారులకే ఇచ్చారు. అలాగే ఒక క్రియేషన్‌ రెండు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులను కొల్లగొట్టడం అనేది సుమారు 13 దేశాల్లో ఉన్న జోయలుక్కాస్‌ బృందాలకు, దశాబ్దాలుగా మమ్మల్ని విశ్వసిస్తున్న తమ కస్టమర్లకు ఎంతో గర్వకారణమని అన్నారు. ఈ అందమైన చెవిపోగులు ఒక్కసారి తమ కనులారా చూడాలంటే.. దుబాయ్‌ గోల్డ్ డిస్ట్రిక్ట్‌లోని 'జ్యూయల్ ఆఫ్ జాయ్ బై జాయలుక్కాస్' షోరూమ్‌కి వెళ్లాల్సిందే. 

ఇదీ చదవండి: అయోధ్య రామ మందిరాన్ని తలపించే వాచ్‌..! ఎన్నెన్నో ప్రత్యేకతలు..
 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)