ఛాతి ఎముకలను తొలగించి .. అరుదైన శస్త్ర చికిత్స

Published on Mon, 05/26/2025 - 13:03

శంషాబాద్‌: ఛాతి ఎముకల వెనుక ఏర్పడిన క్లిష్టమైన కణితిని ఆర్కన్‌ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి విజయవంతంగా తొలగించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆదివారం ఆస్పత్రి వైద్య బృందం మీడియాకు వెల్లడించింది. మొయినాబాద్‌ మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన రైతు కృష్ణ ఏడాది కిందట పొలంలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డాడు. కొద్ది కాలం తర్వాత ఛాతి వెనుక తీవ్రమైన నొప్పి వస్తుండటంతో పలుచోట్ల వైద్యం చేయించుకున్నా తగ్గలేదు. ఇటీవల ఆర్కన్‌ ఆస్పత్రిలో చేరిన ఆయనకు సింగపూర్‌లో వైద్య విద్యనభ్యసించిన ప్రముఖ కార్డియోథొరాసిక్‌ వాసు్కలర్‌ సర్జన్‌ అరుణ్‌ కనాల నేతృత్వంలో ప్లాస్టిక్‌ సర్జన్‌ మధువినయ్, ఆర్థోపెడిక్‌ వంశీమోహన్, క్రిటికల్‌ కేర్‌ వైద్యనిపుణులు ఖాద్రీ, ఆస్పత్రి ఎండీ, ఎమర్జెన్సీ మెడిసిన్‌ వైద్యనిపుణులు చంద్రకాంత్‌ల బృందం శస్త్ర చికిత్స ద్వారా గుండె, ఊపిరితిత్తులకు ఇబ్బందులు కలగకుండా ఛాతి ఎముకలను తీసి వెనుక ఉన్న కణితిని తొలగించారు. అక్కడ ప్రత్యేక లేయర్‌ను అమర్చినట్లు వైద్య బృదం వివరించింది. ఆరు రోజుల్లో రోగి పూర్తిగా కోలుకున్నాడని వైద్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా రైతు కుటుంబ సభ్యులు వైద్యబృందానికి కృతజ్ఞతలు తెలిపారు. 

ఇదీ  చదవండి:  ఊపిరి పీల్చుకున్న నాసా : ఎవరీ యువరాజ్‌ గుప్తా

వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి నార్సింగి మార్కెట్‌ కమిటీ  వైస్‌ చైర్మన్‌ దశరథ్‌యాదవ్‌

మణికొండ: ఆస్పత్రులు, సేవా సంస్థలు ఏర్పాటు చేసే ఉచిత ఆరోగ్య శిబిరాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, వాటిని ప్రతి ఒక్కరూ సది్వనియోగం చేసుకోవాలని నార్సింగి మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ కె.దశరథ్‌యాదవ్‌ అన్నారు. మణికొండ మున్సిపాలిటీ అలకాపూర్‌ టౌన్‌షిప్‌లో ఆదివారం ధన్వి మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్, రిథమ్‌ స్పెషాలిటీ క్లినిక్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మనం సమతుల ఆహారాన్ని తీసుకోకపోవడం, శారీరక వ్యాయామం లేకపోవటంతో చాలామందికి పలు రోగాలు వస్తున్నాయన్నారు. ఇలాంటి ఆరోగ్య శిబిరాలలో వాటిని ముందుగా తెలుసుకుని వైద్యుల సలహాలు పాటించి నయం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. రోగం ముదిరి పరిస్థితి చేతుల దాటకముందే ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం అన్ని రకాల ఆరోగ్య పరీక్షలను చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ వి.బాల్‌రెడ్డి, ధన్వీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్‌ ఎండీ కె.శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్‌లు, సిబ్బందితో పాటు వందలాది మంది టౌన్‌షిప్‌ వాసులు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. 

చదవండి: Bio diversity park కేంద్రం వదిలేసింది.. రాష్ట్రం పట్టించుకోదు.!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)