Breaking News

అదిరిపోయే రుచి : ఉసిరితో ఇన్ని రకాలు చేయొచ్చు తెలుసా?

Published on Sat, 11/01/2025 - 13:32

శీతాకాలంలో ఉసిరి చెట్టు గాలి కూడా ఆరోగ్యానికి మంచిది.ఉసిరికాయలో ఉండే  పోషకాలు  మనలోని రోగనిరోధక శక్తికి, చర్మం, జుట్టు, కీళ్ల ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. పులుపు, తీపి, వగరు కలిసిన ఉసిరితో టేస్టీ టేస్టీ వంటకాలు చేసుకోవచ్చు. హెల్తీ డ్రింక్స్‌తో మార్నింగ్‌ను మొదలుపెట్టవచ్చు.  ఇవాల్టి టిప్‌ ఆఫ్‌ ది డేలో భాగంగా  ఉసిరితో చేసుకోదగిన  ఉత్తమ వంటకాలు చూద్దాం.

పులిహోర 
కావల్సినవి: వండి, చల్లార్చిన అన్నం – 2 కప్పులు; ఉసిరి పేస్ట్‌ – అర కప్పు; పచ్చి మిర్చి – 3; ఎండు మిర్చి – రెండు; ఆవాలు -అర టీస్పూన్‌; జీలకర్ర – అర టీ స్పూన్‌; కరివేపాకు – 2 రెమ్మలు; నూనె – 2 టేబుల్‌ స్పూన్లు; పసుపు –  పావు టీ స్పూన్‌; ఉప్పు – తగినంత; పల్లీలు – టేబుల్‌ స్పూన్‌; శనగపప్పు – టీ స్పూన్, జీడిపప్పు– టేబుల్‌ స్పూన్‌

తయారీ: ఉసిరికాయలోని గింజ తీసేసి, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి ∙బాణలిలో నూనె  పోసి, వేడి చేయాలి. దాంట్లో శనగపప్పు, జీడిపప్పు, పల్లీలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసి, వేయించాలి  పోపు దినుసులు వేగాక ఉసిరి పేస్ట్‌ వేసి, కలపాలి ∙పై మిశ్రమాన్ని అన్నంలో వేసి, కలపాలి. 

జామ్‌
కావల్సినవి: ఉసిరి – 250 గ్రా.లు; బెల్లం – 200 గ్రా.లు; నీళ్లు – అర కప్పు; ఏలకులు – 2.
తయారీ: ∙ఉసిరిని ఉడికించి, గింజ తీసేసి, మెత్తగా పేస్ట్‌ చేయాలి ∙మరొక పాత్రలో నీళ్లు, బెల్లం వేసి మరిగించాలి. దీంట్లో ఉసిరి పేస్ట్‌ వేసి, ఉడికించాలి ∙మిశ్రమం ఉడుకుతుండగా, ఏలకుల పొడి వేసి కల పాలి ∙మిశ్రమ గట్టిగా అయ్యేంతవరకు ఉడికించి, దించాలి. చల్లారాక బ్రెడ్‌ లేదా చపాతీతో సర్వ్‌ చేయాలి. 

చదవండి: World Vegan Day 2025 శాకాహారంతో ఆరోగ్య ప్రయోజనాలు

లడ్డు
కావల్సినవి: ఉసిరి తురుము –  అర కప్పు; బెల్లం ΄పొడి – పావు కప్పు; నీళ్లు – పావు కప్పు; నెయ్యి – 2 టీ స్పూన్లు; ఏలకుల  పొడి – చిటికెడు; డ్రై ఫ్రూట్స్‌ (బాదంపప్పు, జీడిపప్పు)– తరిగినవి.

తయారీ: ∙ఉసిరి తురుమును నెయ్యిలో కొద్దిగా వేయించుకోవాలి ∙బెల్లం సిరప్‌ (పావు కప్పు నీళ్లలో బెల్లం తురుము వేసి,  పాకం తయారు చేయాలి) తయారు చేసి, అందులో వేయించిన ఉసిరి, డ్రై ఫ్రూట్స్‌ వేసి కలపాలి ∙మిశ్రమం చల్లారాక చిన్న చిన్న లడ్డూలు చేయాలి. రోజుకు ఒకటి తిన్నా ఇమ్యూనిటీకి బూస్ట్‌లా ఈ లడ్డూ ఉపయోగపడుతుంది.  

ఉసిరి హనీ డ్రింక్‌ 
కావల్సినవి: ఉసిరి రసం – 2 టేబుల్‌ స్పూన్లు; తేనె – టేబుల్‌ స్పూన్‌; మిరియాల  పొడి – చిటికెడు; అల్లం రసం – పావు టీ స్పూన్‌.
తయారీ: ∙అన్నింటినీ కలిపి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి ∙ఇమ్యూనిటీ పెరుగుతుంది, చర్మం నిగనిగలాడుతుంది, జీర్ణక్రియ బాగుంటుంది. 

ఇదీ చదవండి: బ్లాక్‌ ఫంగస్‌ ఉల్లి, తొక్కే కదా, అని తీసి వాడేస్తున్నారా?

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)