Breaking News

Driver Neelam: ఆటో డ్రైవర్‌ సీట్లో ఆమె.. సలాం కొట్టాల్సిందే!

Published on Mon, 02/17/2025 - 13:44

కుటుంబం అనే బండిలో అందరిలా ఆమె ప్యాసింజర్‌ సీట్‌లో కూర్చోవాలనుకోలేదు. పరిస్థితుల ప్రభావంతో.. తన బతుకు బండికి తానే సారథిగా మారింది. ‘ఇలాంటి పనులు మగాళ్లే చేయాలమ్మా..’ అని తోటి మహిళలే సూటిపోటి మాటలు అంటున్నా.. మగవాళ్లు వంకర చూపులు చూస్తున్నా.. ఆమె మాత్రం తన గమ్యం వైపు దూసుకుపోతోంది.  అందుకే ఆ డ్రైవర్‌ గాథ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమైంది.

ఆమె పేరు నీలమ్‌(Neelam). ఢిల్లీలో బిజీ రోడ్లపై ఆటో డ్రైవర్‌గా కనిపిస్తోంది. నిత్యం మెట్రోలో వెళ్లే ఓ ఉద్యోగిణి.. ఎందుకనో ఆ ఆటో ఎక్కాల్సి వచ్చింది. ‘‘ఆటోను నడిపేది ఓ మహిళనా?’’ అని తొలుత ఆమె కూడా అందరిలా ఆశ్చర్యపోయింది. ఈ పనినే ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందని నీలమ్‌ను కుతూహలంతో అడిగిందామె. అక్కడి నుంచి జీవితం ఒకసారి నీలమ్‌ ఎదుట గిర్రున తిరిగింది.

అందరిలాగే పెళ్లై కోటి ఆశలతో అత్తింటి అడుగు మోపిందామె. కానీ, ఆ ఇంట అడుగడుగునా ఆమెకు వేధింపులే (Domestic Violence) ఎదురయ్యాయి. చివరకు.. కట్టుకున్నవాడు కూడా ఆ వేధింపులను మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. ఓపిక ఉన్నంతకాలం భరించిన ఆమె.. అది నశించడంతో చంటి బిడ్డతో సహా బయటకు వచ్చేసింది. 

బయటకు వచ్చాక కష్టాలు స్వాగతం పలికాయి. చేయడానికి ఆమెకు ఏ పని దొరకలేదు. సొంతంగా ఏదైనా చేయాలని అనుకున్నా.. పుట్టింటి వాళ్ల ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. అందుకనే.. ఇలా ఆటో నడుపుతున్నట్లు నవ్వుతూ చెప్పిందామె.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న కథనం స్క్రీన్‌షాట్‌

కానీ, ఆ మహిళా ఆటో డ్రైవర్‌(Woman Auto Driver) పెదాలపై నవ్వు కంటే ఆమె గొంతులో దిగమింగుకుంటున్న బాధ, కళ్లలో కూతురికి బంగారు భవిష్యత్తు అందించాలని పడుతున్న ఆరాటం రెండూ కనిపించాయి. అందుకే నీలమ్‌ కథను ఆ మహిళ సోషల్‌ మీడియాలో పోస్ట్‌‌ చేసింది. సమాజంలో మార్పును స్వాగతించేవాళ్లెందరో నీలమ్‌ నిర్ణయాన్ని అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)