Breaking News

భర్తతో కలిసి దీపికా గణపతి పూజ, రణ్‌వీర్‌ న్యూ లుక్‌ వైరల్‌

Published on Thu, 08/28/2025 - 13:08

బాలీవుడ్‌ స్వీట్‌ కపుల్‌ దీపికా పదుకొనే-రణ్‌వీర్ సింగ్ గణేష్ చతుర్థి (ఆగస్టు 27న)ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈ జంట అంబానీ నివాసాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా దురంధర్‌ నటుడు రణవీర్‌ న్యూలుక్‌ వైరల్‌గా మారింది. పాప పుట్టిన తరువాత పబ్లిక్‌ అప్పియరన్స్‌కు దూరంగా ఉన్న వీరిద్దరూ జంటగా కనిపించడంతో ఫ్యాన్స్‌ సంబరపడిపోతున్నారు.  పల్లవ్‌  పల్లీవాల్‌ ఇన్‌స్టాలో షేర్‌ చేసిన కొన్ని సెకన్లు మాత్రమే ఉన్న వీరి వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది.

గోల్డ్‌ అండ్‌గ్రీన్‌ దుస్తుల్లో  దీపికా ,రణ్‌వీర్ సింగ్  మెరిసారు. ముఖ్యంగా ధురంధర్ షూటింగ్ ప్రారంభించిన నెలల తర్వాత వచ్చిన క్లీన్-షేవ్ లుక్‌ నెటిజన్లు ఆకర్షిస్తోంది. పొడవాటి జుట్టు, గడ్డాన్ని తొలగించి కనిపించాడు. ఈ దంపతులు ముంబైలోని వరసిద్ధి వినాయకుడిని ఎక్కువగా ఆరాధిస్తారు. గర్భంతో ఉన్నపుడు దీపికా ఈ గణపతిని దర్శించుకున్న సంగతి తెలిసిందే.

దీపికా పదుకొనే- రణ్‌వీర్ సింగ్ గత ఏడాది సెప్టెంబర్ 8న తమ తొలి సంతానం దువాకు జన్మనిచ్చారు.  దువాకు మరికొన్ని రోజుల్లో సంవత్సరం నిండనుంది. తమ కుమార్తెను ప్రజల దృష్టి నుండిదూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. ఫోటోలను తీయవద్దని కూడా అభ్యర్థించారు కూడా. మరి దువా ఫస్ట్‌ బర్త్‌డే వేడుకలు ఘనంగా ఉండబోతున్నాయా?ఈ సందర్భంగా నైనా పాపను చూపిస్తారా? అనే ఉత్కంఠ అభిమానుల్లో ఉందైంది.

కాగా రణ్‌వీర్ సింగ్ ధురంధర్ ఫస్ట్ లుక్  సినిమా హాళ్లలో సందడి చేయనుంది. ఇటీవల డిజిటల్‌గా లాంచ్‌ అయిన 2 నిమిషాల 42-సెకన్ల కట్, రేపు సినిమాల్లో విడుదలయ్యే పరమ సుందరికి జతచేయబడుతుంది. జాతీయ అవార్డు గ్రహీత ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 5 డిసెంబర్ 2025న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
 

Videos

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)