Breaking News

పట్టుచీరలపై నూనె మరకా? ఎప్పటికీ కొత్తవాటిలా మెరవాలంటే!

Published on Wed, 06/11/2025 - 13:17

పెళ్లిళ్లు,పార్టీల  సీజన్‌ వచ్చిందంటే ఏ చీర కట్టుకోవాలి అనేది పెద్ద ప్రశ్న. చీర ఉంటే,  సమయానికి మ్యాచింగ్‌ బ్లౌజు కనిపించదు. అంతేకాదు రెండింటికీ తగ్గట్టు  జ్యుయల్లరీ వెతుక్కోవాలి.అన్నీ బావున్నాయి అంటే..  మనకు నచ్చిన పట్టుచీర  మరక వెక్కిరిస్తుంది. మరి  పట్టుచీరపై మరకలుపడితే ఏం చేయాలి?  పట్టుచీరలు మెరుపు తగ్గకుండా కొత్తవాటిలా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.


పట్టు చీరపై నూనె మరక పడితే..?
పట్టు చీర కట్టుకున్నప్పుడు పూజలు వంటి ప్రత్యేక సందర్భాలలో నూనె చుక్కలు పడటం సహజమే. నూనె మరక పడిన వెంటనే శుభ్రమైన  పొడి కాటన్‌ బట్టతో ఆ ప్రదేశంలో అద్దాలి. బట్ట లేకపోతే పేపర్, టవల్‌ తో కూడా నూనె పడిన చోట అద్దవచ్చు.

అయితే ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే మరక పడిన చోట గట్టిగా రుద్దితే మిగతా చోట్లకు వ్యాపించే అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే నూనె పీల్చుకుని ఆ ప్రదేశంలో మరక పోవడం మొదలవుతుంది. నూనె పడిన చోట మాత్రమే మెల్లగా అద్ది మరకను తొలగించాలి. (Akhil -Zainab: పెళ్లి తరువాత తొలిసారి జంటగా : డాజ్లింగ్‌ లుక్‌లో అఖిల్- జైనబ్‌)

ఇలా వస్త్రం లేదా పేపర్‌ టవల్‌ తో అద్దిన తర్వాత అక్కడ  పౌడర్‌ చల్లి శుభ్రం చేయాలి.  పౌడర్‌ చల్లి మరక పడిన చోటును నీటితో కడిగితే చాలు. పేరుకు  పోయిన నూనె, మురికి అంతా పోతుంది. పొరపాటున కూడా వేడి నీటితో మరకలను తొలగించడానికి ప్రయత్నించవద్దు. వేడి నీరు పడితే మరక పోనే  పోదు.

మరక ఉన్న చోట బేకింగ్ సోడా లేదా కార్న్‌స్టార్చ్‌ను పలుచగా చల్లి కొద్దిసేపటి తర్వాత, వేరే ఏదైనా బట్టతో తుడిచివేసి, మళ్ళీ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వెనిగర్ లేదా నిమ్మరసం తీసుకొని  కొద్దిగా  నీరు  కలిపి, సున్నితమైన బట్టతో మరక ఉన్న ప్రాంతాన్ని తుడవాలి. పట్టు చీరలను శుభ్రం చేసిన తర్వాత, వాటిని నీడలో ఆరనివ్వాలి.
 

ఇదీ చదవండి: మీ ముఖం చందమామలా మెరవాలంటే..!

ఎలా శుభ్రం చేయాలంటే..
ఖరీదైన చీరలను సాధ్యమైనంత వరకు ఇంట్లో వాష్‌ చేయకపోవడమే మంచిది. డ్రై క్లీనింగ్ లేదా ఇతర ప్రొఫెషనల్ క్లీనింగ్ సేవలను ఉపయోగించుకోవాలి.

పట్టు చీరలను మడతపెట్టేటప్పుడు, జాగ్రత్తగా మడతపెట్టి, పొడి గాలి తగిలేలా చేయాలి.

అలాగే బంగారు, వెండి జరీ చీరలను మెత్తటి కాటన్‌ బట్టలో చుట్టి ఉంచడం మంచిది.

సంవత్సరాల తరబడి ఒకే మడతల్లో చీరలను అలా ఉంచేయకూడదు. మధ్యమధ్యలో గాలికి ఆరనిచ్చి,మడతలు మార్చిపెట్టుకోవాలి.  

పట్టు చీరలను శుభ్రం విషయంలో  ఏదైనా అనుమానాలుంటే ఎక్స్‌పర్ట్‌ సలహా తీసుకోవడం ఉత్తమం. 

మగ్గం వర్క్‌ బ్లౌజులను  ఉల్టా చేసిన మడతపెట్టుకునొ భద్రపరుచుకోవాలి. లేదంటే స్టోన్స్‌, కుందన్స్‌ ఊడిపోయి, అందం పోతుంది. 

 ఇదీ చదవండి: Weight Loss వేగంగా బరువు తగ్గాలంటే..

ఇంకో చిట్కా:
పాతగా అనిపించిన పట్టు చీరల్ని పిల్లలకు పట్టులంగాలుగా కుట్టింవచ్చు. లేదంటే పెద్దవాళ్లే లాంగ్‌ ఫ్రాక్‌, డిజైనర్‌ బ్లౌజులు, కుర్తాలుగా రీమోడలింగ్‌ చేయించుకోని  రీయూజ్‌ చేసుకోవచ్చు. 
 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)