Breaking News

‘యానిమల్’‌ వార్‌ మెషిన్‌గన్‌ వాహనంపై పెళ్లి ఊరేగింపు, నెటిజన్ల కామెంట్స్‌

Published on Thu, 12/12/2024 - 16:35

‘మురారి’,  ‘వరుడు’ సినిమాల లెవల్లో పెళ్లి చేసుకోవాలని ఒకపుడు పెళ్లి కాని పిల్లలు కలలు కనేవారు. కాలానికి తగ్గట్టు ఇపుడు ట్రెండ్‌ మారింది. బ్లాక్‌ బస్టర్‌ మూవీ ప్రేరణతో పెళ్లి చేసుకోవడం విశేషంగా నిలిచింది.  'వార్ మెషిన్ గన్'తో  వధూవరుల ఎంట్రీ అందరి దృష్టిని ఆకర్షించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. నెటిజన్ల వేలాది ఫన్నీ కామెంట్లతో సందడితో  ఏకంగా 15 మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించింది.

రణబీర్ కపూర్ , నేషనల్‌ క్రష్‌ రష్మిక నటించిన యానిమల్ స్ఫూర్తితో కదిలే స్టీల్ మెషిన్ గన్‌పై జంట వివాహ వేడుకును జరుపుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఆశిష్ సుయ్వాల్ ఈ వీడియోను షేర్ చేశాడు. ఈ మూవీలో రణబీర్ కేరెక్టర్‌ 500 కిలోల మూవబుల్ స్టీల్ మెషిన్ గన్‌ని ఉపయోగించి తన శత్రువులతో పోరాడిన దృశ్యాలు అభిమానులను ఉర్రూతలూగించి. ఈ నేపథ్యంలో యాక్షన్ సీక్వెన్స్‌లా  ప్రత్యేకంగా తయారు చేసిన వాహనంగాపై వివాహ వేదికకు చేరుకోవడాన్ని ఈ వీడియోలు చూడవచ్చు.  వధువు సిగ్గుతో గన్ క్యారేజ్‌పై కూర్చొని ఉండగా, వరుడు గర్వంగా ఈ  స్పెషల్‌ రైడ్‌ను ఆస్వాదిస్తున్నాడు. 

 “హవ్వా పగ, ప్రతీకారంతో అధికారంకోసం మనుషులను చంపే పాత్రగా ఎందుకు మారతారు" అని ఒకరు, "ఆమె తన జీవితంలో తదుపరి యుద్ధానికి సిద్ధమవుతోంది’’ అని ఒకరు వ్యాఖ్యానించారు  క్రియేటివిటీకోసం ఎంతకైనా తెగిస్తున్నారు అంటే ఇంకొక నెటిజన్‌ ఒకింత ఆశ్చర్యాన్ని  వ్యక్తం  చేయడం గమనార్హం. ఇది ఎక్కడ జరిగింది అనే వివరాలు మాత్రం అందుబాటులో లేవు.

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)