Breaking News

జస్ట్‌ రెండు నెలల్లో 20 కిలోలు తగ్గాలంటే..!

Published on Thu, 05/07/2026 - 16:38

ఎలాంటి షార్ట్‌కట్‌లు లేకుండా త్వరిగతిన కిలోల కొద్ది బరువు తగ్గాలనుకునే వారికి ఈ కంటెంట్‌ క్రియేటర్‌ చెప్పే సలహాలు, సూచనలు ఎంతగానో హెల్ప్‌ అవుతాయి. ఆమె తనకు ఇష్టమైన ఫుడ్‌ తీసుకుంటూనే..సరైన జీవనశైలిని నిలకడగా పాటిస్తూ తగ్గానని చెబుతున్నారామె. అదెలాగో సోషల్‌ మీడియా వేదికగా ఆమెనే స్వయంగా వివరించారు. మరి ఆ టిప్స్‌ ఏంటో చూసేద్దామా..!.

ఇటీవలకాలంలో అందరూ సంక్లిష్టమైన డిటాక్స్ ప్లాన్‌లు లేదా ఫ్యాన్సీ హెల్త్ ఫుడ్స్‌కు బదులుగా, చాలా మంది ఎక్కువ ప్రోటీన్ తినడం, ఎక్కువగా నడవడం, చక్కెర తగ్గించడం, నిలకడగా ఉండటం వంటి సాధారణ మార్పులపై దృష్టిసారిస్తున్నారు. బహుశా అందుకే ఈ కంటెంట్‌ క్రియేటర్‌ అంజలి సచిన్‌ తన వెయిట్‌ జర్నీ అందర్నీ అమితంగా ఆక‌ర్షిస్తోంది. ఆమె చెప్పే ఆహారపు అలవాట్లు సైతం అందరు సులభంగా పాటించగలిగేవే కావడం విశేషం. ఆమె కేవలం రెండు నెలల్లోనే 20 కిలోలు బరువు తగ్గానని చెప్పుకొచ్చారు. 

అందుకోసం ఏం చేశారో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఆమె కేలరీ డెఫిసిట్‌ ప్రాధాన్యంగా తీసుకుని డైట్‌ని పాటించినట్లు పేర్కొన్నారు. అంటే శరీరం ఒక రోజులో ఖర్చు చేసే కేలరీల కంటే తక్కువగా తీసుకోవడం. ఇక ఆమె తన దినచర్యలో అధిక ప్రోటీన​, అధిక ఫైబర్‌ ఉన్న భోజనం, కార్బోహైడ్రేట్లు, చక్కెరను పూర్తిగా మానుకోవడం తోపాటు స్వీట్లు, శీతల పానీయాలు, చిరుతిళ్లను రాత్రిపూట తీసుకోకుండా దూరంగా ఉండటం వంటివి చేసినట్లు తెలిపారు. 
​ఆ క్రియేటర్‌ క్రమం తప్పకుండా పాటించిన 12 కఠినమైన అలవాట్లు..

అధిక ప్రోటీన్ + అధిక ఫైబర్ ఉన్న భోజనం
తక్కువ కార్బోహైడ్రేట్ల విధానం
చక్కెర వద్దు (స్వీట్లు, శీతల పానీయాలు వద్దు)
తక్కువ నూనె + తక్కువ ఉప్పు
రోజుకు 15,000 అడుగులు
ఉపవాసం (ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్)
వెయిట్ ట్రైనింగ్/వెయిట్‌లిఫ్టింగ్
సమయానికి నిద్రపోవడం
కొన్నిసార్లు రోజుకు ఒక పూట భోజనం (అవసరమైనప్పుడు)
సాయంత్రం 6 గంటల తర్వాత డిన్నర్ వద్దు
చిరుతిళ్లు తినవద్దు / అనవసరమైన చిరుతిళ్లు వద్దు

నెలకు 8-10 కిలోలు తగ్గాలనుకుంటే, ఈ నియమాలను క్రమశిక్షణతో పాటించండి. నిలకడ = పరివర్తన, అన్నింటకంటే ముఖ్యం అని అని అంజలి సచన్ పోస్ట్‌లో రాశారు. ఈ అలవాట్లతో పాటు, ఆమె శాకాహార, మాంసాహార భోజన ప్రణాళికలతో కూడిన 7-రోజుల తక్కువ కార్బోహైడ్రేట్, అధిక ప్రోటీన్ డైట్ చార్ట్‌ను కూడా పంచుకున్నారు.

శాకాహార ప్రణాళికలో పనీర్ భుర్జీ, టోఫు, సోయా చంక్స్, మొలకలు సలాడ్, గ్రీక్ పెరుగు, మూంగ్ దాల్ చిల్లా, బెసన్ చిల్లా, రాజ్మా, వెజిటబుల్ సూప్, సలాడ్‌లు వంటి ఆహారాలు ఉన్నాయి. మాంసాహార వెర్షన్‌లో గుడ్లు, చికెన్, చేపలు, వే ప్రోటీన్‌తో కూడిన ఓట్స్, చికెన్ సలాడ్, ఎగ్ బుర్జీలకు ప్రాధాన్యత ఇచ్చారు.

ఈ ప్లాన్‌లో చాలా మందికి నచ్చిన అంశం ఏమిటంటే, ఇది ఖరీదైన “డైట్” ఉత్పత్తులకు బదులుగా సాధారణ ఇంటి వంటకాలను ఉపయోగించడం. ఈ భోజనాలు సరళంగా, ప్రోటీన్‌కు ప్రాధాన్యతనిస్తూ, తయారుచేయడానికి సులభంగా ఉంటాయి.

అదే సమయంలో, వేగంగా బరువు తగ్గడం అనేది అందరిపై ఒకే విధంగా పనిచేయకపోవచ్చని ఆరోగ్య నిపుణులు తరచుగా చెబుతుంటారు. ఒక వ్యక్తి  శరీరాకృతి, జీవనశైలి ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా ఆహారం, వ్యాయామ దినచర్యలను ఎల్లప్పుడూ వేరుగా ఉంటాయనేది గ్రహించాలి. 

 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

(చదవండి: 35 ఏళ్లకే 11 ఏళ్ల కార్పొరేట్ కెరీర్‌కు ముగింపు..! ఆ కారణంతోనే..)
 

Videos

సాయంత్రానికి రూ.2 వేల పతనం.. బంగారం ధరల మిస్టరీ!

మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చరణ్, సుకుమార్ సినిమా..

బంగాళాఖాతంలో అల్పపీడనం మరో రెండు రోజులు భారీ వర్షాలు

విజయకి కాన్వాయ్ రద్దు DGPపై గవర్నర్ సీరియస్

నడి రోడ్డుపై మహిళా ఎమ్మెల్యేను బలవంతంగా...

ప్రెస్ మీట్ మధ్యలో ఏడుస్తూ వెళ్లిపోయిన వర్మ...

జగన్ పై తప్పుడు కథనం పరువు పోగొట్టుకున్న జావా డిస్కవరీ ఛానల్

చంద్రబాబు కాన్ఫరెన్స్ లు కాదు.. రైతుల కష్టాలు చూడు

TVK విజయ్ పై కుట్ర పోసాని సంచలన రియాక్షన్

వస్తావా? నీ రేట్ ఎంత? పోకిరీలకు మిడ్ నైట్ సినిమా చూపించిన లేడీ కమిషనర్

Photos

+5

శారీలో డెకాయిట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ అందాలు.. (ఫొటోలు)

+5

‘గోదారి గట్టుపైన..’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

‘అగ్లీ స్టోరీ’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

SRH vs PBKS : ఉప్పల్‌లో ఫుల్‌ జోష్‌.. తారల సందడి (ఫొటోలు)

+5

మహేశ్ బాబు సోదరుడి కుమారుడి మూవీ సాంగ్ షూట్ (ఫొటోలు)

+5

నిర్మాత ఆర్‌బీ చౌదరి భౌతిక కాయానికి సినీ ప్రముఖుల నివాళులు (ఫొటోలు)

+5

బర్త్ డే బ్యూటీ.. అందాల భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

'టీవీకే' విజయ్‌ని ఇలా ఎప్పుడూ చూసుండరు (ఫొటోలు)

+5

తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభం (ఫొటోలు)

+5

శ్రీకాకుళం : అంగరంగ వైభవంగా భద్రమహంకాళి అనుపు ఉత్సవం (ఫొటోలు)