Breaking News

ట్రంప్‌ ఎఫెక్ట్‌ : కేన్‌ షుగర్‌ కోకా కోలా కమింగ్‌ సూన్‌

Published on Thu, 07/24/2025 - 17:29

కోకా-కోలా తన ట్రేడ్‌మార్క్ కోకా-కోలా లైనప్‌ను విస్తరింపజేస్తూ  అమెరికా మార్కెట్ కోసం అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్‌కు బదులుగా చెరకు చక్కెరతో తయారు చేసిన  కేన్‌ షుగర్‌ కోకా కోలా  సాఫ్ట్‌ డ్రింక్‌ను లాంచ్‌  చేస్తున్నట్టు ప్రకటించింది. కంపెనీ రెండవ త్రైమాసిక ఆదాయాలప్రకటన సందర్బంగా  ఈ విషయాన్ని ప్రకటించింది.  డైట్ కోక్ అభిమానిగా పేరుగాంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కోరిక మేరకు ఈ నిర్ణయం  తీసుకుంది.డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి తర్వాత కోకా-కోలా అమెరికాలో కేన్ షుగర్ కోక్‌ను ప్రారంభించినట్లు ధృవీకరించింది.

గత వారం అధ్యక్షుడు ట్రంప్  అమెరికాలో నిజమైన చెరకు చక్కెరతో చేసిన కోక్‌కోసం  కోకా-కోలాను ఒప్పించానని పేర్కొంటూ సోషల్ మీడియా పోస్ట్‌ చేశారు.  జూలై 16న ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేసిన పోస్ట్‌లో తాను  దీనిపై  తాను కోకా-కోలాతో మాట్లాడుతున్నానని, వారు అలా చేయడానికి అంగీకరించారని"  తెలిపారు.

మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలకు  అమెరికా మొక్కజొన్న పరిశ్రమనుంచి  సహా మిశ్రమ స్పందనలు వచ్చాయి.అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్‌ను చెరకు చక్కెరతో భర్తీ చేయడం సమంజసం కాదు. అధ్యక్షుడు ట్రంప్ అమెరికన్ తయారీ ఉద్యోగాలు, అమెరికన్ రైతులు , వాణిజ్య లోటును తగ్గించడంకోసమే ఉన్నారంటూ కార్న్ రిఫైనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు , CEO  జాన్ బోడే  విమర్శించారు.  అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్‌ను చెరకు చక్కెరతో భర్తీ చేయడం వల్ల వేలాది అమెరికన్ ఆహార తయారీ ఉద్యోగాలు తగ్గిపోతాయి. వ్యవసాయ ఆదాయం తగ్గుతుంది ,విదేశీ చక్కెర దిగుమతులు పెరుగుతాయన్నారు.

ఇదీ చదవండి: 10 నెలల పాపను ఛాతీపై పట్టుకోబెట్టుకునే తండ్రికి వింత అనుభవం

కాగా  కోకా-కోలా మొదట తన అన్ని పానీయాలలో చెరకు చక్కెరను ఉపయోగించేది. కానీ 1984లో చక్కెర ధరలు పెరగడంతో అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్‌కు మారిందని ఫార్చ్యూన్ తెలిపింది. సాధారణంగా "మెక్సికన్ కోక్" అని పిలువబడే చెరకు చక్కెర కోకా-కోలా, మెక్సికో నుండి దిగుమతుల ద్వారా  అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే అందుబాటులో ఉంది, అక్కడ దీనిని గాజులో బాటిల్ చేసి సాంప్రదాయ తీపి పద్ధతులను ఉపయోగించి తయారు చేస్తారు.

చదవండి: ఏనుగులంటే ప్రాణం : కానీ మల్టీ మిలియనీర్‌ని ఏనుగే తొక్కేసింది!

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు