Breaking News

కొడుకు స్నేహితుడితో పెళ్లి, త్వరలో బిడ్డ : వ్యాపారవేత్త లవ్‌ స్టోరీ వైరల్‌

Published on Mon, 06/30/2025 - 16:01

50 ఏళ్ళ వయసులో ఒక చైనా మహిళ తన కొడుకు స్నేహితుడిని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. అంతేకాదు ఇపుడు ఒక బిడ్డకు తల్లి కాబోతోంది. ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.  ఈ కథేంటో తెలుసుకుందాం పదండి

ఆగ్నేయ చైనాకు చెందిన  ఈ-కామర్స్ వ్యవస్థాపకురాలు "సిస్టర్ జిన్". తన కొడుకు రష్యన్ క్లాస్‌మేట్‌ను  పెళ్లాడింది.  30 ఏళ్ళ వయసులో మొదటి భర్తనుంచి విడాకులు తీసుకున్న ఆమె కొడుకు, కుమార్తెను స్వతంత్రంగా పెంచి పెద్ద చేసింది. సబర్బన్ విల్లా, చెఫ్‌, డ్రైవర్‌ ఇలా సకల హంగులతో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపే ఆమె చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ డౌయిన్‌లో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది.  13,000 మందికి పైగా  ఫాలోయర్లు ఉన్నారు.

ఆరేళ్ల ప్రేమ తరువాత  పిల్లల ఆమోదంతో   కొడుకు కైకై రష్యన్‌ ఫ్రెండ్‌ డైఫును పెళ్లి చేసుకుంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్  కథనం ప్రకారం న్యూ ఇయర్‌ పార్టీ సందర్భంగా కొడుకు తన ఫ్రెండ్స్‌ను ఇంటికి ఆహ్వానించినపుడు డైఫుతో పరిచయం ఏర్పడింది. సిస్టర్ జిన్ వంటలకు  ఆతిథ్యానికి  ఫిదా అయిన డైఫు తన సెలవులను పొడిగించుకున్నాడు.  చైనాలో చాలా సంవత్సరాలు గడిపిన తర్వాత చైనీస్ భాషను కూడా మాట్లాడే డైఫు, జిన్‌తో టచ్‌లో ఉంటూ, అనేక గిఫ్ట్‌లు ఇచ్చి పుచ్చుకున్నాడు.  అచ్చమైన ప్రేమికుల్లాగానే వీరిద్దరి మధ్య అనేక సర్‌ప్రైజ్‌లు కూడా ఉన్నాయి. 20 ఏళ్ల వయసు  తేడా, ఎత్తులో తేడా, గతంలో విఫలమైన వివాహం తదితర కారణాల రీత్యా జిన్‌  తొలుత  వ్యతిరేకించినా, ఆ తరువాత ఇవేవీ వీరి ప్రేమకు అడ్డంకి కాలేదు.  కొడుకు ప్రోత్సాహంతో అతడి ప్రేమను  స్వీకరించింది. ఈ జంట ఈ  ఏడాది ప్రారంభంలో అధికారికంగా తమ వివాహాన్ని నమోదు చేసుకున్నారు.  చైనా అంతటా విస్తృతంగా పర్యటించారు. (యాంటీ ఏజింగ్‌ ఇంజెక్షన్లతో ముప్పు ; షెఫాలీ ప్రాణం తీసింది అవేనా?)

చివరికి జూన్‌8న తన ప్రెగ్రెన్నీని ప్రకటించింది. లేట్‌ ఏజ్‌  ప్రెగ్నెన్సీ ప్రమాదమే కానీ, డైఫుతో జీవితం చాలా బావుంది అంటూ సిస్టర్ జిన్ సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వారా తన గర్భధారణను ప్రకటించింది ఆన్‌లైన్ వినియోగదారులు వీరి వివాహ  చట్టబద్ధతను ప్రకశ్నించారు. అయితే కాలమే తమ ప్రేమను  రుజువు చేస్తుందని సమాధానమిచ్చింది. పుట్టబోయే బిడ్డను స్వాగతించేందుకు ఉత్సాహంగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

ఇదీ చదవండి: Today Tip బరువు తగ్గాలంటే.. జామ ఆకూ ఔషధమే

 
 

Videos

ఆఫ్రికాలో మరో ఇద్దరు భారతీయులు మృతి

ముద్రగడ కుమారుడికి వైఎస్ జగన్ ఫోన్.. తండ్రి ఆరోగ్యంపై ఆరా

117 ఏళ్ల చరిత్ర ఉన్న లాల్ దర్వాజా బోనాలు

CEO చిలక్కొట్టుడు.. లైవ్ లో అడ్డంగా బుక్కైపోయాడు..

లిక్కర్ స్కాం అనేది చంద్రబాబు హయాంలో జరిగింది: సజ్జల

స్పిరిట్ కోసం పూర్తిగా మారిపోయిన ప్రభాస్ లుక్..!

పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడమే చంద్రబాబు లక్ష్యం

మిథున్ రెడ్డి అక్రమ అరెస్ట్ పై పెద్దిరెడ్డి రియాక్షన్

మమల్ని ఆపడానికి మీరెవరు.. పోలీసులపై లాయర్లు ఫైర్

సీతగా 'సాయిపల్లవి'నే ఎందుకు.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్

Photos

+5

విజయనగరం: శ్రీ విజయ సాగర దుర్గా మల్లేశ్వర అమ్మవారి ఆషాడం సారే (ఫొటోలు)

+5

ట్రెండీ వేర్ కాదు.. చీరలో ఒకప్పటి హీరోయిన్ మీనా (ఫొటోలు)

+5

మెగా కోడలు ఉపాసన బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జులై 20-27)

+5

హైదరాబాద్ లో ఘనంగా బోనాలు (ఫొటోలు)

+5

వరంగల్‌లో సినీనటి నిధి అగర్వాల్‌ సందడి (ఫొటోలు)

+5

లండన్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న నీరజ్ చోప్రా.. (ఫొటోలు)

+5

డస్కీ బ్యూటీ బ్రిగిడ.. చుడీదార్‌లో ఇలా (ఫొటోలు)

+5

యూట్యూబ్‌లో ట్రెండింగ్.. రష్మిక 'నదివే' సాంగ్ HD స్టిల్స్ (ఫొటోలు)

+5

కొంపల్లిలో సందడి చేసిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య (ఫొటోలు)