Breaking News

తాతయ్య వేళకు మందులు వేసుకునేలా..మనవడి అద్భుత ఆవిష్కరణ!

Published on Fri, 07/31/2026 - 13:17

మన అవసరాలు, ఇబ్బందులే ఒక్కోసారి ఆవిష్కరణకు దారితీస్తాయి. ఒక్కోసారి మన ప్రియమైన వాళ్ల కోసం కొంగొత్త ఆవిష్కరణలకు నాందిపలుకుతాయి. అచ్చం అలాంటి ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. చిన్నప్పటి నుంచి అన్ని తానై పెంచిన తాత బాగోగులు కోసం ఈ మనవడు ఏం చేశాడో తెలిస్తే విస్తుపోతారు. 

ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. షాంఘైకి చెందిన 18 ఏళ్ల విద్యార్థి మాకై తన తాత వేళకు మందులు వేసుకునేలా గుర్తు చేయడానికి సహాయపడేలా ఓ యాప్‌ని రూపొందించి అందరిచేత శెభాష్‌ అనిపించుకున్నాడు. తన తాతగారిపై ఉన్న అపారమైన ప్రేమ ఈ యాప్‌ రూపకల్పనకు దారితీసిందని చెబుతుండటం విశేషం. ఇటీవలే సెకండరీ స్కూల్ పూర్తి చేసిన మా కై, జూన్‌లో చైనా జాతీయ విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష అయిన గావోకావోను రాశాడు.

జూలై మధ్యలో షాంఘైలో జరిగిన వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్ (WAIC)కు హాజరైనప్పుడు షాంఘై మార్నింగ్ పోస్ట్ అతడిని ఇంటర్వ్యూ చేయడంతో ఈ కథ వెలుగులోకి వచ్చింది. బీజింగ్‌కు చెందిన ఏఐ కంపెనీ మోడల్‌బెస్ట్ అభివృద్ధి చేసిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (LLM) అయిన మినీసీపీఎం (MiniCPM)ను ఉపయోగించి తాను ఈ యాప్‌ను రూపొందించినట్లు మా వివరించాడు. ఆ కాన్ఫెరెన్స్‌లో కంపెనీకి చెందిన కొంతమంది నిపుణులు వస్తారని తెలిసి, వారిని ప్రశ్నలు అడగడానికి వచ్చానని అతను చెప్పాడు. 

తాతగారి కోసం రూపొందించిన యాప్‌ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, ఇందులో కేవలం కొన్ని లైన్ల కోడ్ మాత్రమే ఉందని వెల్లడించాడు. తాను రూపొందించిన యాప్‌ మందులు వేసుకోవాలని గుర్తు చేయడమే కాకుండా, యూజర్‌ ప్యాకేజింగ్‌ ఫోటోని అప్‌లోడ్‌ చేసినట్లయితే..మందుల గడువు ముగిసిందో లేదో కూడా ఈ యాప్ తనిఖీ చేయగలదుని చెప్పుకొచ్చాడు. ఒకవేళ మందుల గడువు ముగిసినట్లయితే వేసుకోవద్దని గట్టిగా హెచ్చరిస్తుందని తెలిపాడు. చిన్ననాటి నుంచి అన్నీ తానై తాతగారే పెంచారని, ఆయనతో ఉన్న అనుబంధం మాటలకందనిదని పంచుకున్నాడు. 

ప్రస్తుతం 70 ఏల్ల వయసులో ఉన్న ఆయనకు కొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు వెల్లడించాడు. తాను కాలేజ్‌కి వెళ్లిపోయినా..ఆయన వేళకు మందులు వేసుకోవాలనే ఆరోగ్య సంరక్షణ నిమిత్తమే ఈ యాప్‌ని రూపొందించానని అన్నాడు. తన తాతగారికి జ్ఞాపకశక్తి తక్కువగా ఉండటం వల్ల మందులు వేసుకోవడం మర్చిపోతారేమో లేదా వాటిని తికమక పడతారేమో అని ఆందోళనతోనే ఇలా యాప్‌ని ఆవిష్కరించినట్లు వెల్లడించాడు. 

పొరపాటున గడువు మందులు తీసుకుంటే పరిస్థితి ఏమవుతుందన్న ఆందోళన, భయమే ఈ యాప్‌ని రూపొందించడానికి కారణమని చెప్పాడు. కాగా, తాను వచ్చే నెల సెప్టెంబర్‌లో మరో నగరంలోని విశ్వవిద్యాలయలంకు వెళ్లాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. ఇష్టమనేది అవతలి వాడి బాధ్యత, సంరక్షణను హ్యాండిల్‌ చేయడమని తన జీవనశైలితో చాటి చెప్పాడు కదూ..!.

(చదవండి: ‘మద్దాలి శివారెడ్డి’గా అలరించిన రవికిషన్‌ వెయిట్‌లాస్‌ జర్నీ..! ఓమాడ్‌తో ఏకంగా 18 ​కేజీలు..)
 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)