Breaking News

కొత్త రుచులు వద్దమ్మా..

Published on Thu, 10/29/2026 - 13:43

పిల్లలు కొత్త రకాల ఆహార పదార్థాలు తినడానికి మొండికేస్తున్నారా? కేవలం కొన్ని రకాల వంటకాలే తింటామని పట్టుబడుతున్నారా? అయితే దీన్ని వారి మంకుతనంగా కొట్టిపారేయలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివెనుక ఫుడ్‌ నియోఫోబియా (కొత్త ఆహారాన్ని చూసి భయపడటం లేదా నిరాకరించడం) అనే సమస్య ఉండవచ్చని హైదరాబాద్‌లోని భారతీయ వైద్య పరిశోధనా మండలి–జాతీయ పోషకాహార సంస్థ (ఐసీఎంఆర్‌–ఎన్‌ఐఎన్‌) తాజా అధ్యయనంలో తేలింది.

తల్లుల అవగాహన, తినిపించే పద్ధతులు పిల్లల ఆహార అలవాట్లను ప్రభావితం చేస్తాయని పరిశోధన వెల్లడించింది. హైదరాబాద్‌లోని అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన 150 మంది తల్లులు, వారి పిల్లలను (2–7 ఏళ్లు) ఈ అధ్యయనం కోసం ఎంపిక చేసుకున్నారు. పిల్లల శారీరక పెరుగుదల, బరువును ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం పరిశీలించారు. అలాగే తల్లుల అవగాహనను, వారు పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు ప్రదర్శించే ప్రవర్తనను ఒక ప్రశ్నావళి ద్వారా అంచనా వేశారు.

77 శాతం మందిలో మధ్యస్థ లక్షణాలు..
ఈ అధ్యయనంలో పాల్గొన్న పిల్లల్లో దాదాపు 77 శాతం మందికి మధ్యస్థంగా, 11.3 శాతం మందికి తీవ్రంగా ఫుడ్‌ నియోఫోబియా సమస్య ఉన్నట్లు తేలింది. 12 శాతం మంది పిల్లలు మాత్రమే కొత్త ఆహారాన్ని సులభంగా స్వీకరిస్తున్నారు. ఆడపిల్లలతో పోలిస్తే మగపిల్లల్లో కొత్త ఆహారాన్ని నిరాకరించే గుణం కాస్త ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. తగినంత బరువు లేని పిల్లలు కొత్త వంటకాలను తినడానికి ఎక్కువ మొండితనం ప్రదర్శిస్తున్నట్లు ఈ పరిశోధనలో స్పష్టమైంది. పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఎలా తినిపించాలనే విషయాలపై అవగాహన, ఓర్పు ఉన్న తల్లుల పిల్లల్లో ఈ భయం తక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

బలవంతంగా తినిపించవద్దు..
పిల్లల ఆహార అలవాట్లను మార్చడానికి తల్లులు కొన్ని నియమాలు పాటించాలని ఈ పరిశోధనకు సారథ్యం వహించిన శాస్త్రవేత్త డాక్టర్‌ కార్తికేయన్‌ రామానుజం సూచించారు. కొత్త వంటకాలను పిల్లలకు బలవంతంగా తినిపించకూడదని.. ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా పలుమార్లు ఆ ఆహారాన్ని వారికి పరిచయం చేయాలన్నారు. భోజనం చేసే సమయంలో పిల్లలు ఒత్తిడికి గురికాకుండా ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని పేర్కొన్నారు.

పిల్లలు ఆహారం తినేందుకు నిరాకరిస్తే వారిని తిట్టరాదని.. ప్రేమగా తినిపించడం అలవాటు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ అంగన్‌వాడీ కేంద్రాలు, పోషకాహార పథకాల ద్వారా తల్లులకు ఈ విధమైన తినిపించే పద్ధతులపై కౌన్సెలింగ్‌ ఇవ్వడం ద్వారా పిల్లల్లో పోషకాహార లోపాలను అధిగమించవచ్చని ఎన్‌ఐఎన్‌ తెలిపింది. పిల్లల చిన్నతనంలో తినే వైవిధ్యమైన ఆహారంపైనే వారి భవిష్యత్తు ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని.. కాబట్టి తల్లిదండ్రులు ఓపికతో వ్యవహరించాలని ఈ పరిశోధన స్పష్టం చేస్తోంది.

ఇదీ చదవండి: మనసంతా తిండి మీదే! ఆ రీజన్‌ వల్లే ఈ సమస్య..

Videos

నా పెళ్లి గురించి మీకెందుకు? KTR పై బల్మూరి వెంకట్ భార్య ఫైర్

కాస్కోండి ఒక్కొక్కడికి ప్యాంట్ తడిచిపోకపోతే.. రోజా నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

భాగ్యలక్ష్మి పై ట్రోల్స్ చేయడం కాదు.. దమ్ముంటే..!

హీరోగా వంగా ఇక స్క్రీన్ పై అరాచకమే

పబ్లిసిటీ ఆపి.. రైతులను ఆదుకో చంద్రబాబుకు కన్నబాబు డిమాండ్స్

దొంగ సంతకాలతో విత్ డ్రా చేశారు... మంత్రి ఆనంపై సంచలన వ్యాఖ్యలు

నగరిలో దుమ్మురేపిన రోజా ఎన్నికల ప్రచారంలో

జార్ఖండ్ ను అంటుకున్న అర్నబ్ తుఫాన్

DIWALI GIFT! ఒక రోజు ముందే రిలీజ్

ఓట్లు అంటే చెప్పు తీసి కొడతా..! టీడీపీ నేతలను పరిగెత్తించిన ప్రజలు

Photos

+5

విశ్వక్ సేన్‌ కల్ట్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన అడ్వెంచర్ స్పాట్స్ ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబై : 'ELLE ఇండియా బ్యూటీ అవార్డ్స్ 2026' (ఫోటోలు)

+5

150 కిలోమీటర్ల ప్రచండ గాలులు... అర్నబ్ తుపాను బీభత్సం (ఫోటోలు)

+5

హైదరాబాద్ : హెబ్బా.. హోయ్‌రబ్బా! (ఫోటోలు)

+5

అర్నబ్ తుపాను విధ్వంసం.. కోనసీమ జిల్లా అతలాకుతలం (ఫోటోలు)

+5

‘KilleR’ సినిమా 1 కోటి రూపాయల కాంటెస్ట్ ప్రెస్‌మీట్ (ఫోటోలు)

+5

‘దొంగ నా కొడుకు’ మూవీ సాంగ్ లాంచ్ (ఫోటోలు)

+5

స్టాక్‌ మార్కెట్‌లోకి జియో.. అంబానీ కుటుంబంలో వెల్లివిరిసిన ఆనందాలు (ఫోటోలు)

+5

ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన హీరోయిన్ నివేదా పేతురాజ్ (ఫోటోలు)