Breaking News

తెలంగాణ బోనం.. సాంస్కృతిక ప్రయాణం..

Published on Fri, 06/13/2025 - 11:16

ఆషాఢమాసంలో బోనాల జాతర ఉత్సవాలకు నగరం సిద్ధమవుతోంది. పాతబస్తీలో ఈసారి బోనాల పండుగను ఘనంగా నిర్వహించడానికి భాగ్యనగర్‌ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఇప్పటికే సర్వసభ్య సమావేశం నిర్వహించింది. 

పాతబస్తీలో బోనాల సమర్పణ అనంతరం నిర్వహించే సామూహిక ఘటాల ఊరేగింపులో ప్రధాన పాత్ర వహించే శకటాలు, కళాకారుల విన్యాసాల కోసం సంబంధిత ఉత్సవాల నిర్వాహకులు పెద్ద ఎత్తున కళాకారులకు ఇప్పటికే బుకింగ్స్‌ ఇస్తున్నారు.

(చదవండి: ఆదివాసీ కోయిల.. ! ఇంజనీర్‌ గ్రాడ్యుయేట్‌ కాస్తా.. ర్యాప్‌ సింగర్‌గా..)

కళాకారుల నృత్య ప్రదర్శనలు.. 
ఈసారి ఉత్సవాల్లో కళాకారుల నృత్య ప్రదర్శనలు హైలెట్‌గా నిలువనున్నాయి. కళాకారులు ప్రదర్శించే హావభావాలను చూసే ప్రతి ఒక్కరూ భక్తిపారవశ్యంతో తన్మయత్వం పొందుతారు. ఘట స్థాపన ఊరేగింపు, పోతురాజుల నృత్యాలు, అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు తదితర కార్యక్రమాల్లో వివిధ రకాల అలంకరణల్లో, రూపాల్లో కళాకారుల నృత్య ప్రదర్శనలు భక్తులను ఎంతగానో అలరిస్తాయి.  

పాతబస్తీకి ప్రత్యేకం..
నిజాం కాలం నుంచి ఇక్కడి అమ్మవారి దేవాలయాల్లో పూజలు నిర్వహించి అమ్మవారికి ప్రత్యేకంగా తయారు చేసిన బోనాన్ని సమర్పించడం ఆనవాయితీ. తెలంగాణ సంస్కృతి, ఆచార వ్యవహారాలకు అద్దం పట్టే విధంగా నగరంలో ఆషాఢమాసం బోనాల జాతర ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయి. తెలంగాణ జిల్లాల్లోనే అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవాలు పాతబస్తీ ప్రత్యేకతను చాటుతాయి.

ఇతర రాష్ట్రాల కళాకారులకు ఉపాధిగా.. 
రాష్ట్రంలో జరిగే బోనాల ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, తమిళనాడుకు చెందిన కళాకారులు ఎక్కువగా పాల్గొంటారు. నగరంలో బోనాల జాతర ఉత్సవాల్లో కళాకారులు, వినూత్న తరహా సెట్టింగ్స్‌ కోసం నిర్వాహకులు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తారు. 

ఈసారి కళాకారులకు డిమాండ్‌ ఎక్కువగానే ఉంది. దీంతో ఇప్పటికే బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. పాతబస్తీలోని ప్రముఖ దేవాలయాల నిర్వాహకులు కళాకారుల కోసం పోటీ పడుతున్నారు. దీంతో కొన్ని వందల కుటుంబాల కళాకారులకు ఈ బోనాల జాతర ఉత్సవాలు యేటా ఉపాధి కల్పిస్తున్నాయి.  

ఆకట్టుకునే రూపాలు, నృత్యాలు.. 
బోనాల జాతర ఉరేగింపులో కేరళ పులికళి, భేరీ నృత్యం, గరిగెలు, బేతాళ నృత్యం, ఒగ్గోళ్ల నృత్యం, బోనాలు, కాళికాదేవీ, లక్ష్మీదేవీ, వేంకటేశ్వర స్వామి, పొట్టి పోతరాజులు, సింహరథం, డప్పులోళ్లు, హనుమంతునిలో రాముడు, తయ్యం, దేవ నృత్యం, ఉరుములు, కొమ్ముకొయ్య, జడ కోలాటం, యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి శకటం.. అందులో ఏర్పాటు చేసే మూర్తులు, విజయవాడ కనకదర్గమ్మ దేవాలయ రథం.. అందులో కొలువుదీరే అమ్మవారి వేషధారణలోని కళాకారుల హావభావాలు.. ఇలా ఒకటేంటి పలు రకాల శకటాలు, కళాకారుల నత్యాలు విశేషంగా ఆకట్టుకుంటాయి.  

(చదవండి: తొమ్మిదేళ్లకే గజ్జె కట్టి... ఏకంగా మిస్‌ వరల్డ్‌ 2025లో..)

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)