Breaking News

మహిళలకు ఫ్రీ బస్సా? ఇదెక్కడి న్యాయం అంటూ ట్వీట్‌ : ఇచ్చిపడేసిన నెటిజనులు

Published on Fri, 01/10/2025 - 17:40

అటు కర్ణాటక,  ఇటు తెలంగాణాలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాలు  అమలు చేస్తున్న  మహిళలకు ఉచిత బస్సు పథకం మహిళలను బాగా ప్రయోజనకరంగా మారింది. మరోవైపు ఉచిత ప్రయాణంపై అనేక సందర్భాల్లో తీవ్ర విమర్శలు  కూడా వస్తున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన వ్యక్తి సోషల్‌  మీడియాలో చేసిన పోస్ట్‌ చర్చకు దారి తీసింది. ప్రస్తుతం దీనిపై తెగ చర్చ నడుస్తోంది.

బెంగళూరుకు చెందిన కిరణ్ కుమార్  అనే వ్యక్తి మహిళలకు ఉచిత బస్సు  ప్రయాణంపై తన అభిప్రాయాన్ని   ట్విటర్‌లో పంచుకున్నాడు.  అసలు కేవలం ఆధార్‌ చూపించిబస్సులో ప్రయాణించడం ఎంతవరకు న్యాయం అంటూ తన అక్కసంతా వెళ్లగక్కాడు.  

కుమార్ పోస్ట్‌లో అందించిన వివరాల ప్రకారం బెంగళూరు నుండి మైసూరుకు KSRTC బస్సులో ప్రయాణ ఛార్జీ  రూ.210.  ఈ బస్సులో 50 మంది ప్రయాణికులలో దాదాపు 30 మంది మహిళలు. 20 మంది పురుషులు  డబ్బులుచెల్లించి టికెట్‌ తీసుకుంటే, ఆధార్ చూపించి  30మంది ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఇది న్యాయమా?  సమానత్వం అంటే ఇదేనా?. ఒక వృద్ధుడు చెల్లించడానికి నోట్లు దొరక్క ఇబ్బంది పడుతోంటే, మరో పక్క వీడియో కాల్‌లో ఒక ధనిక యువతి దర్జాగా ఫ్రీగా వెళుతోంది అంటూ చెప్పుకొచ్చాడు.

ప్రభుత్వం అంత మిగులు ఆదాయాన్ని ఆర్జిస్తుంటే, విమానాశ్రయ షటిల్ సర్వీస్ తరహాలో సార్వత్రిక ఉచిత బస్సు సేవను ప్రకటించవచ్చు కదా అని ప్రశ్నించాడు. ప్రపంచవ్యాప్తంగా, సబ్సిడీలు, సంక్షేమం భరించలేని వారికి కదా ఇచ్చేది, కానీ బెంగళూరు , మైసూరు వంటి నగరాల్లో ధనవంతులైన మహిళలకు ఉచిత పథకమా అంటూ  ఆక్రోశమంతా వెళ్లగక్కాడు. ఓట్ల కోసం ఉచితాలనే దుర్మార్గపు చక్రంలోకి ప్రవేశించాం,  సమీప భవిష్యత్తులోదీన్నుంచి  బయటపడటం కష్టం అంటూ వాపోయాడు.

దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు.  చాలామంది  ఈ పథకాన్ని సమర్థించారు. సాధారణంగా ఉచితాలను ఆమోదించను కానీ  రెండుమూడు సార్లు BMTCలో ప్రయాణించా. బస్సులో ప్రయాణించే చాలా మంది మహిళలు రోజువారీ వేతన కార్మికులు లేదా  సాధారణ ఉద్యోగులే కనుక..అది చూసి మంచిగా అనిపించింది ఒక యూజర్‌ వ్యాఖ్యానించారు. 

"ఇది ఉచితాలు కాదు. ప్రజలు ఇచ్చే పన్నులకు బదులుగా ప్రభుత్వం సమాజానికి తిరిగి చెల్లిస్తోంది. ఇది  అర్థం చేసుకోకపోతే, ప్రజాస్వామ్య ప్రభుత్వం ,పాలనా సూత్రాలు అర్థం  కావు అంటూ మరో వినియోగడదారుడు చురకలేశాడు.

మరి కొంతమంది ఆయన వాదను సమర్ధించారు.  తాము చెల్లించే ఇలా పోతున్నాయి.. ఇది తనకు నచ్చలేదు అంటూ మహిళల ఫ్రీ బస్సు పథకంపై ప్రతికూలంగా స్పందించారు.

 నెగెటివ్‌  కామెంట్స్‌
‘‘మీ వాదన సరైనదే. ఉచితం కాదు.. 50శాతం చేయండి. మహిళలకు ఈ ఉచిత ప్రయాణం పాఠశాల, కళాశాల ,పనికి వెళ్లే సాధారణ ప్రయాణికులకు  కష్టంగా మారింది.’’ 

"నా ఆదాయపు పన్నును రోడ్లు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగించాలి... అర్హత లేని వారికి ఉచితాలను పంపిణీ చేయడానికి కాదు" 

 

"ఇతరులు చెల్లించడానికి ఇబ్బంది పడుతుండగా, సంపన్న మహిళలకు ఉచితాలను అందజేయడం. ఓటు బ్యాంకు రాజకీయం తప్ప మరొకటి కాదు. సబ్సిడీలను మౌలిక సదుపాయాలు లేదా నిజంగా అవసరమైన వారికి సహాయం చేయడం వంటి నిజమైన సమస్యలకు ఉపయోగించాలి. ఇలా కొంతమందిపై అదనపు భారం  ఎందుకుమోపాలి? ఇది స్పష్టమైన అసమానత, పురోగతి కాదు" 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)