Breaking News

క్లౌడ్‌ కిచెన్‌తో లక్షల్లో నష్టం..కానీ పదినెలల్లోనే రూ. 2 కోట్లు!

Published on Wed, 09/02/2026 - 13:43

ఏ వ్యాపారమైన మొదలుపెట్టగానే వెంటనే సక్సెస్‌ అందుకోలేం. పక్కా ప్లాన్‌తో వచ్చినవాళ్లు చిన్నగా పుంజుకోగలరేమో గానీ..చాలామంది మొదట్లో నష్టాలే చవిచూస్తారు. ఆ తర్వాత రానురాను అందులో ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ..మంచి విజయంతో నిలదొక్కుకుని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తుంటారు. అచ్చం అలాంటి కోవకు చెందన వాళ్లే ఈ బెంగుళూరు దంపతులు. వాళ్లు ఏ వ్యాపారంలో అయితే తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నారే దానికే  చిన్ని మార్పులు జోడించి ఏ రేంజ్‌లో లాభాలు అందుకున్నారో తెలిస్తే..ఆశ్చర్యపోవడం ఖాయం. 

ఆ జంటే బెంగుళూరుకి చెందిన కుశాల్‌ రెడ్డి, చాహక్‌ జైన్‌లు. వాళ్ల వ్యాపారం ప్రయాణం చిన్న క్లౌడ్‌ కిచెన్‌తో ప్రారంభమైంది. అయితే దీని ప్రారంభ పెట్టుబడి రూ. 4 లక్షలతో మొదలైంది. అయితే ఈ వ్యాపారానికి తగినన్ని ఆర్డర్లు సంపాదించుకోవడంలో విఫలమయ్యారు. ఫలితంగా ఫుడ్‌ డెలివరీ ఫ్లాట్‌ఫామ్‌లు వసూలు చేసే అధిక కమీషన్లు, ప్రకటనల ఖర్చులు, ప్రత్యక్ష ఆర్డర్‌ కొరత వంటివి సంస్థపై ఒత్తిడి పెంచాయి. దాంతో ఆ దంపతులు దాన్ని మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. 

కానీ ఈ జంట వెనక్కి తగ్గకుండా ఎక్కడైతే నష్టపోయామో అక్కడే తిరిగి సక్సెస్‌ సాధించి లాభం పొందాలని గట్టిగా అనుకుని ఈ సారి వంటగదిని, మార్కెటింగ్‌ చేసే విధానాన్నే మార్చారు. ఈసారి ఫుడ్‌ ట్రక్‌తో బెంగళూరులోని జేపీ నగర్‌లో ఎంట్రీ ఇచ్చారు. దానికి క్రీడ్‌ అనే ఫ్రైడ్‌ ఫుడ్‌ బ్రాండ్‌గా నామకరణం చేసి వ్యాపారం ప్రారంభించారు. అలాగే తాము మొదలుపెట్టబోయే ఫుడ్‌ ట్రక్‌ వ్యాపారం గురించి ముందుగానే సోషల్‌ మీడియాలో వెల్లడించి..దాని నమునా తాలుకా వీడియోని కూడా షేర్‌ చేశారు. 

దాంతో తమ వ్యాపారంలోని మొదటి బర్గర్‌ సేల్‌ అవ్వక మునుపే యూజర్ల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. అంటే ఆ జంట వ్యాపార క్రీడ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాకు ఏకంగా ఐదువేలకు పైగా ఫాలోవర్లు ఉండటం విశేషం. అలా ఆ జంట ఆ వ్యాపారాన్ని సెప్టెంబర్‌ 2025లో ప్రారంభించారు. తొలిరోజే వందమందికి పైగా కస్టమర్లు వచ్చారట. ఈ వ్యాపారం మొదటి మూడు రోజుల్లోనే ఏకంగా ముప్పై వేల అమ్మకాలు జరిగాయట. ఆ ఊపు ఇప్పటికీ అలానే కొనసాగుతూ రోజుకి సుమారు 350 నుంచి 450 మంది కస్టమర్లకు సేవలు అందిస్తూ..రోజుకి దాదాపు రూ. 1 లక్ష పైగానే ఆర్జిస్తున్నట్లు ఆ దంపతులే స్వయంగా సోషల్‌ మీడియాలో వెల్లడించారు. 

పైగా తమ మెనూలో ఫ్రైడ్ చికెన్, పనీర్ బర్గర్‌లతో పాటు, చికెన్ పాప్‌కార్న్, స్ట్రిప్స్, ఫ్రైస్ వంటి ఐటమ్స్‌ని కూడా అందిస్తున్నారు. అంతేగాదు ఆ దంపతులు విఫలమన క్లౌడ్‌ కిచెన్‌కు లాభలా బాటలో నడుస్తున్న క్రీడ్‌ వ్యాపారంల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపుతు ప్రథమ్‌ అనే యూజర్‌ ఎక్స్‌పోస్ట్‌లో వివరించారు. ఈ పోస్ట్‌ నెటిజన్లును అమితంగా ఆకర్షించింది. పైగా పోస్ట్‌ ప్రకారం..ఆ క్రీడ్‌ వ్యాపారం రూ. 4 లక్షల పెట్టుబడితో ప్రారంభిస్తే..కేవలం పది నెలల్లో సుమారు రూ. 2 కోట్ల ఆదాయాన్ని ఆర్జించడం విశేషం. 

ఇది చిన్న ఆహార వ్యాపారాలకు ఒక గొప్ప ఆర్థిక పాఠంగా మారింది. అంతేగాదు సోషల్‌ మీడియాను వ్యాపార ప్రచారానికి ఎలా ఉపయోగించుకోవచ్చో తెలియజేసింది కూడా. అంతేకాదండోయ్‌ ఈ దంపతులు రెడ్డి-జైన్‌లు తమ ఫుడ్‌ ట్రక్‌ మోడల్‌ నుంచి ఒక పెద్ద సెంట్రల్ కిచెన్, ఫాస్ట్-క్యాజువల్ రెస్టారెంట్ అవుట్‌లెట్‌గా తమ వ్యాపారాన్ని విస్తరించే ప్లాన్‌లో ఉన్నారట. ఈ జంట కథ..ఓడిపోయిన చోటే గెలుపుని వెతుక్కోవాలే తప్ప వెనక్కి రాకూడదని చెబుతోంది. అలాగే ఓటమికి గల కారణాలను విశ్లేషించి..ఆ తప్పులకు తావివక్కుండా మంచి ప్రారంభంతో ముందుకు రావాలని చెబుతోంది కదూ..!.

 

(చదవండి: Miss World 2026: సర్వాంగ సుందరీ మాత్రమేకాదు..అద్భుతమైన నటి..! మిస్‌ ఇండియా సైతం..)
 

Videos

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

నేపాల్ లో సోనుసూద్.. వరద బాధితులకు అండగా రియల్ హీరో

వేటు పడుద్ది! KC వేణుగోపాల్ తో కొండా సురేఖ భేటీ

Photos

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)