Breaking News

బెడ్‌ టైం యోగా : ప్రశాంతమైన నిద్రకోసం, చక్కటి ఆసనాలు

Published on Mon, 10/27/2025 - 17:42

స్క్రీన్‌ టైమ్, ఒత్తిడితో కూడుకున్న జీవన శైలి కారణంగా ఈ రోజుల్లో చాలామంది నిద్రకు దూరం అవుతున్నవారు. నిద్ర సమస్యలనుంచి విముక్తి లభించి, మంచి నిద్ర పట్టాలంటే సులువైన యోగాసనాలు ఉన్నాయి. నిద్రకు ఉపక్రమించడానికి అరగంట ముందు ఈ ఆసనాలు సాధన చేయడం వల్ల మంచి ప్రయోజనాలను  పొందవచ్చు. 
 

పశ్చిమోత్తనాసనం
నేలపైన కాళ్లను ముందుకు చాపి, కూర్చోవాలి. శరీరాన్ని మోకాళ్ల వైపు వంచి, చేతులు పాదాలను తాకించాలి. ఈ భంగిమలో రెండు నిమిషాలు ఉండాలి. దీని వల్ల మానసిక ప్రశాంతత కలిగి మంచినిద్రకు సహాయపడుతుంది.

అర్ధ శలభాసనం
మ్యాట్‌పైన బోర్లా పడుకొని, ఒక కాలును పైకి లే΄ాలి. తలను నెమ్మదిగా వెనక్కి వంచాలి. ఐదు శ్వాసల తర్వాత, రెండో కాలితో ఇలాగే చేయాలి. దీనివల్ల రక్తప్రవాహం మెరుగై మానసిక శాంతి పెరుగుతుంది.

శవాసనం
మ్యాట్‌పైన పడుకొని, చేతులను రిలాక్స్‌గా ఉంచుతూ ఐదు నిమిషాలు ఉండాలి. సాధారణ శ్వాసలు తీసుకుంటూ ఉండాలి. దీని వల్ల మానసిక శాంతి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గి, మంచి నిద్ర పడుతుంది.

చదవండి: శివసేన నేతతో నటి ఎంగేజ్‌మెంట్‌ : ఫోటోలు వైరల్‌

పరిపూర్ణ శ్వాస 
శ్వాస తీసుకొని, కొద్ది సెకన్లు ఆ శ్వాసను బిగబట్టి, తిరిగి నెమ్మదిగా  వదలాలి. ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ, ముక్కుద్వారానే వదలాలి. ఇలా 3 నుంచి 5 నిమిషాలు చేయాలి. ఒత్తిడి తగ్గి, శరీరానికి విశ్రాంతి లభించి, నిద్ర బాగా పడుతుంది. స్క్రీన్‌ టైమ్, ఒత్తిడితో కూడుకున్న జీవన శైలి కారణంగా ఈ రోజుల్లో చాలామంది నిద్రకు దూరం అవుతున్నవారు. నిద్ర సమస్యలనుంచి విముక్తి లభించి, మంచి నిద్ర పట్టాలంటే సులువైన యోగాసనాలు ఉన్నాయి. నిద్రకు ఉపక్రమించడానికి అరగంట ముందు ఈ ఆసనాలు సాధన చేయడం వల్ల మంచి ప్రయోజనాలను పొందవచ్చు. 

(ఎక్కడ చూసినా సీతాఫలాలే, ఇవిగో సింపుల్‌ అండ్‌ టేస్టీ రెసిపీస్‌)

బలాసన
ముందుగా మ్యాట్‌పైన మోకాళ్ల పై కూర్చోవాలి. ముందుకు వంగి, తలను మోకాళ్ల మీదుగా తీసుకెళుతూ, నేలను తాకాలి. అదే సమయంలో చేతులు ముందుకు చాచి, మోకాళ్లపై విశ్రాంతి తీసుకోవాలి. ఈ భంగిమంలో రెండు నిమిషాలు ఉండాలి. దీంతో శరీరం రిలాక్స్‌ అయ్యి, ఒత్తిడి తగ్గుతుంది.


రాత్రి నిద్రించడానికి ముందు చేసే కొన్ని యోగాసనాల వల్ల జీర్ణక్రియ పనితీరు మెరుగ్గా ఉంటుంది. గ్యాస్ట్రిక్,  పొట్ట భాగంలో అధిక కొవ్వు సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుంది. భోజనం చేసిన రెండు గంటల తర్వాతనే ఈ ఆసనాలను సాధన చేయాలి. అప్పుడే నిద్ర, ఉదరకోశ సమస్యలకు సరైన ఫలితాలను పొందుదుతారు. 

Videos

అంబాలా ఎయిర్ బేస్ లో రాష్ట్రపతి ముర్ము సాహసం!

భారీ గాలులతో వర్షాలు.. హైదరాబాద్ ప్రజలకు హెచ్చరిక

Montha Cyclone : వరద బాధితులకు నిత్యావసర వస్తువులు అందించిన గంగుల బ్రిజేంద్ర రెడ్డి

APSRTCపై మోంథా పంజా.. ప్రయాణికుల కష్టాలు

డ్రగ్స్ మాఫియాపై ఎటాక్.. 64 మంది మృతి..

Montha Cyclone: 60 ఏళ్ల వయసులో ఇలాంటి ఉప్పెన చూడలేదు

బాబు వద్దనుకున్న గ్రామ సచివాలయ సిబ్బందే కీలక పాత్ర పోషించారు..

Jains Nani: ప్రొడ్యూసర్ వాళ్ళని తిట్టడంలో తప్పు లేదు

టీడీపీ నేతల అక్రమ మైనింగ్ ని బయటపెట్టిన శైలజానాథ్

ఆసీస్ తొలి టీ20 మ్యాచ్.. టీమిండియాలో భారీ మార్పు

Photos

+5

తెలంగాణపై మోంథా పంజా.. కుండపోత వర్షాలు (ఫొటోలు)

+5

హీరోయిన్ ప్రియా వారియర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

వణికించిన మోంథా.. స్తంభించిన జనజీవనం (ఫొటోలు)

+5

నిర్మాత దిల్‌రాజు ఇంట్లో పెళ్లి సందడి (ఫొటోలు)

+5

క్యూట్‌గా కవ్విస్తోన్న జెర్సీ బ్యూటీ (ఫోటోలు)

+5

ఒంటరిగా మాల్దీవులు టూర్‌లో నమ్రత (ఫొటోలు)

+5

నా ప్రేమ ఈ రోజే పుట్టింది! లవ్‌ లేడీకి లవ్లీ గ్రీటింగ్స్‌ (ఫొటోలు)

+5

'మాస్ జాతర' ప్రీ రిలీజ్.. శ్రీలీల క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)

+5

కురుమూర్తి జాతర : అంగరంగ వైభవంగా ఉద్దాల ఉత్సవం (ఫొటోలు)

+5

ఒంగోలులో ఈదురుగాలులతో కూడిన వర్షం..రోడ్లు జలమయం (ఫొటోలు)