Breaking News

Attari Border Closure : పెళ్లి ఆగిపోయింది!

Published on Fri, 04/25/2025 - 14:25

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి పాకిస్తాన్‌, భారత్‌ దేశాల  మధ్య ఉద్రికత్తకి దారి తీసింది. ఈ సంఘటన నేపథ్యంలో భారత ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంది. ముఖ్యంగా ఐదు అంశాల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది.ఇందులో అట్టారి-వాఘా సరిహద్దును  తక్షణమే మూసివేయడం. ఈ ఆంక్షల నేపథ్యంలో రాజస్థాన్‌కు చెందిన సైతాన్‌సింగ్‌ కలల వివాహం ఇప్పుడు నిరవధికంగా వాయిదా పడింది.  సరిహద్దులు మూసివేయడంతో నిశ్చితార్థం దాకా వచ్చిన పెళ్లి నిలిచిపోయిందని ఆయన వాపోయాడు.

రాజస్థాన్‌కు చెందిన సైతాన్‌సింగ్‌కు అట్టారీ సరిహద్దు దాటి పాకిస్థాన్‌లో ఉన్న యువతితో వివాహం నిశ్చయమైంది. పెళ్లికి ఇరు కుటుంబాలు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. వరుడి బంధువు చాలామంది ఇప్పటికే పాకిస్థాన్‌కు చేరుకున్నారు. ఇంతలోనే ఉగ్రవాదులు  పహల్గాంలో మారణహోమం సృష్టించారు. 26  మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత్‌ పాకిస్తాన్‌పై ఆంక్షలు విధించింది. సరిహద్దులను మూసి వేయడంతో వధువు ఇంటికి వెళ్లే అవకాశాలు మూసుకు పోయాయి. దీంతో  సైతాన్‌సింగ్‌  ఏం చేయాలోఅర్థం కావడం లేదంటూANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపోయారు.

"ఉగ్రవాదులు చేసింది తప్పు... సరిహద్దు మూసివేతో(పాకిస్తాన్‌కు) వెళ్లడానికి అనుమతించడం లేదు... ఇప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం." అన్నారు. అటు సైతాన్ సింగ్ సోదరుడు సురీందర్ సింగ్ కూడా మీడియాతో మాట్లాడుతూ, "పర్యాటకులపై (పహల్గామ్‌లో) జరిగిన దాడి చాలా తప్పు. దురదృష్టకర దాడి భారతదేశంలోని అనేక మంది అమాయక పౌరుల జీవితాలతో తమ కుటుంబాన్ని ప్రభావితం చేసిందన్నారు.

ఇదీ చదవండి: రూ. 40 లక్షల నుంచి 20 కోట్లకు ఒక్కసారిగా జంప్‌, లగ్జరీ కారు : ఎవరీ నటుడు

 

కాగా ఈ ఉగ్రదాడి తరువాత ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించిన  ఇతర చర్యలలో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాకిస్తాన్ జాతీయులకు సార్క్ వీసా మినహాయింపు పథకాన్ని రద్దు చేయడం, పాకిస్తాన్ సైనిక సలహాదారులను బహిష్కరించడం , ఇస్లామాబాద్‌లో దౌత్య సిబ్బందిని తగ్గించడం ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. జమ్మూ-రాజౌరి-పూంచ్ జాతీయ రహదారిపై సైనిక నిఘా పెరిగింది, చెక్‌పోస్టుల వద్ద  గట్టి  నిఘా కొనసాగుతోంది. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)