Breaking News

‘ప్రకృతి సిద్ధమైన బాణసంచా’ ఇలా ఉంటుందా..?! వీడియో వైరల్‌

Published on Sat, 11/07/2026 - 10:08

ఇస్రో వ్యోమగామి శుభంషు శుక్లా, అంతరిక్షం నుంచి భూమిని చిత్రీకరించిన ఒక అద్భుతమైన వీడియోని పంచుకున్నారు. ఆ వీడియోలో కనిపించే మెరుపులని ఆయన  "ప్రకృతి సిద్ధమైన బాణసంచా(nature’s very own fireworks)"గా అభివర్ణిస్తూ..ఇలా రాసుకొచ్చారు. దీపావళి నా హృదయంలో ఎప్పుడూ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. నాకు ఇది ఎంతో ఇష్టమైన పండుగ. దీపాల వెలుగులు, మెరుపులు, బాణసంచాల్లో ఏదో ప్రత్యేకమైన మాయాజాలం ఉంది. అవి నాలో అద్భుతమైన భావనను, ఆనందాన్ని నింపుతాయి అంటూ..భూమి సహజంగా జరుపుకునే వెలుగుల పండుగకు సంబంధించిన వీడియోని షేర్‌ చేశారు. 

ఆ వీడియోలో..అంతరిక్షంలో ఉన్నప్పుడు భూమిపై మెరుపులు నృత్యం చేస్తున్నట్లుగా కనిపించాయి. అంతరిక్షం నుంచి కిందకు చూస్తున్నప్పుడు అవి నాకు ప్రకృతి సిద్ధమైన బాణసంచాను గుర్తు చేశాయి. విశ్వానికి వెలుగును వేడుకగా జరుపుకోవడానికి తనదైన మార్గం ఉందని చెప్పే ఒక అందమైన దృశ్యమిది. అయితే ఈ దృశ్యాన్ని చూడటం ప్రత్యేకంగా అనిపించడమే కాదు..దీన్ని పంచుకోవడానికి ఇంతకంటే అద్భుతమైన రోజు మరొకటి ఉండదనిపించింది. చివరగా నా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ధన్‌ తేరస్‌ శుభాకాంక్షలు. 

ఈ పండుగ సీజన్‌ మీ ఇళ్లల్లో.. మీ హృదయాల్లో వెలుగును, సంతోషాన్ని, మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని నింపాలని మనసారా కోరుకుంటున్నా." అంటూ పోస్ట్‌ని ముగించారు. కాగా, గ్రూప్‌ కెప్టెన్‌ శుభాంషు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)కు వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి, అలాగే అంతరిక్షంలోకి వెళ్లిన రెండొవ భారతీయుడు కూడా ఆయనే. ఆక్సియమ్-4 (Ax-4) మిషన్‌లో భాగంగా ఆయన 2025 జూన్ 26న అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టారు. ఈ మిషన్‌కు నాసా సీనియర్ అధికారి పెగ్గీ విట్సన్ నాయకత్వం వహించారు.

 

ఇదీ చదవండి: దీపావళి సందేశం..పిల్లలకు నేర్పింద్దాం ఇలా..!

 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)