Breaking News

అర్జున్‌-సానియా వివాహంలో పుత్తడి బొమ్మలా నీతా స్టైలిష్‌ లుక్‌..!

Published on Thu, 03/05/2026 - 15:44

సచిన్‌- అంజలి దంపతుల కుమారుడు, క్రికెటర్‌ అర్జున్‌ టెండుల్కర్‌, యువ వ్యాపారవేత్త సానియా చందోక్‌ల వివాహం గురువారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు క్రికట్‌ దిగ్గజాలు, బాలీవుడ్‌ సెలబ్రిటీలు, ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ వేడుకలో అంబానీ కుటుంబ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అనంత్‌-రాధిక మర్చంట్‌ల వివాహవేడుక జరిగిన అదే ప్రదేశంలో అర్జున్‌ సానియాల వివాహం జరగడం విశేషం. 

ఆ నేపథ్యంలో ఆ సచిన్‌ టెండూల్కర్‌ ఇంట జరిగే పెళ్లి తంతుకి సంబంధించిన ప్రతీది అంబానీ కుటుంబమే స్వయంగా చూసుకుంది. అందుకు సచిన్‌ కూడా సభా ముఖంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు కూడా. కాగా ఈ వేడుకలో ఫ్యాషన్‌కి ఐకాన్‌గా ఉండే రిలయన్స్‌ ఛైర్మన్‌, తన సిగ్నేచర్‌స్టైల్‌తో మెరిశారు. వేడుకుకు తగిన విధంగా తన ఆహార్యాన్ని ప్రతిబింబించేలా కేర్‌ తీసుకుంటారు నీతా. ఆమె ఈ వేడుకకి రిలయన్స్‌ వ్యాపారవేత్త ముఖేష్‌ అంబానీ, పెద్ద కుమారుడు ఆకాష్‌ అతడి భార్య శ్లోకా మెహతాలతో కలిసి విచ్చేశారు. 

ఈ వేడుకలో ఆయు ధరించిన చీర, ధగ ధగ మెరిసిపోతున్న నెక్లెస్‌ అత్యంత హైలెట్‌గా నిలిచాయి. నీతా ఈ వేడుక కోసం రాచరికపు స్టైల్‌ ఐవరీ బంగారు సిల్క్‌ చీర ఎంచుకున్నారు. ఈ ఆరుగజాల చీరలో నీతా బంగారపు బొమ్మలా ముగ్ధమనోహరంగా కనిపించారు. బంగారు మోటీఫ్‌లతో అలకరిచిన ఆ ఫ్యాబ్రిక్‌ ప్రకాశవంతమైన ఆకృతిని ఇచ్చింది. నిలువు జరీ చారలతో ఎంబ్రాయిడరీ స్లీవ్‌ బోర్డర్లు చీర లుక్‌ని మరింత అందంగా కనిపించేలా చేసింది. 

ఆ చీరకు సింపుల్‌గా స్టేట్‌మెంట్‌ డైమండ్‌ నెక్లస్‌ చీర అందాన్ని అమాంతం రెట్టింపు చేసింది. చెవికి కూడా డైమండ్‌ స్టడ్‌ పోగులు ధరించి స్టైల్‌ పరంగా నీతాకు సాటిరారెవ్వరూ అనేంతగా ఉంది ఆమె ఆహార్యం. ఇక ముఖేశ్‌ అంబానీ కూడా క్లాసిక్‌ బ్లాక్‌ బంధ్‌ గలా సూట్‌లో హుందాగా కనిపించారు. అంతేగాదు ఈ జంట ఆధునాతన సంప్రదాయంతో కలగలసిన స్టైలిష్‌ లుక్‌లో అందరి మనసులను దోచుకున్నారు.

 

(చదవండి: 'మిర్చి హోలీ'..రంగు పులుముకున్న పుడమి తల్లి..!: ఆనంద్‌ మహీంద్రా)

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)