Breaking News

కుగ్రామం నుంచి 'కుబేర' వరకూ..!

Published on Wed, 06/25/2025 - 10:57

ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న కుబేర సినిమా అనేక మంది విమర్శకుల ప్రశంసలను అందుకుంటూ దూసుకెళ్తోంది. ఎప్పుడూ కొత్త తరహా కథలను తెరకెక్కించే శేఖర్‌ కమ్ముల ఈ సారి సామాజిక కథాంశంతో పాన్‌ ఇండియా స్థాయిలో సినిమా తీశారు. ఇది ఎంతగానో ప్రజాదరణ పొందుతోంది. శేఖర్‌ కమ్ముల డైరెక్షన్‌ టీంలో ఛీప్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు అరవింద్‌ ఏవీ. తాను తెలుగు యూనివర్సిటీ, ఉస్మానియా విద్యార్థి. ట్రావెలర్, ఫొటోగ్రాఫర్‌గా అందరికీ సుపరిచితమే. 

నల్లగొండ జిల్లా దేవరకొండ తాలుక మారుమూల కుగ్రామమైన మేడారంలో పుట్టి పెరిగారు. బాల్యదశలో బతుకు కోసం కుటుంబం సాగించిన వలసలో నడుస్తూ.. హుజూర్‌ నగర్, నిడమానూరు, మిర్యాలగూడ, హలియ అనేక ప్రాంతాల్లో జీవించాల్సి వచ్చింది. సంక్షేమ హస్టల్స్‌లో చదువుకుంటూ క్యాటరింగ్, రైస్‌ మిల్లుల్లో నైట్‌ షిఫ్ట్స్‌ చేయడం.. సొంత ఖర్చులను సమకూర్చుకుంటూ చదువుకున్నారు. మరోవైపు దేశభక్తి, ఇతర సామాజిక అంశాల్లో క్రియాశీలకంగా పనిచేయడం బాధ్యతగా భావించారు. 

యూనివర్సిటీలో అడుగులు.. 
యూనివర్సిటీ విద్యార్థిగా తమ గ్రామం నుంచి వచ్చిన మొదటి తరం విద్యార్థి. మాస్‌ కమ్యూనికేషన్‌ చదవుతూనే వార, మాస పత్రికలు నడిపారు. చిన్నతనంలో పేపర్‌ బాయ్‌గా పనిచేయటం వల్ల సాహిత్య పఠనం అలవడింది. అనేక సామాజిక, సాహిత్య అంశాలను స్పృశిస్తూ.. కవితలు, వ్యాసాలు రాశారు. 

సాహిత్య ప్రచారం.. 
కథ, కవిత్వం, నవలలు విరివిగా చదవటం. చదివిన పుస్తకాలను  నలుగురికీ పంచడం అవసరమని.. ‘ఆలోచన’ అనే సంస్థ ద్వారా గ్రామీణ, పట్టణ విద్యార్థులకు చిట్టి–పొట్టి జానపద కథల నుండి దేశభక్తుల జీవిత చరిత్రల వరకూ పరిచయం చేయడం, చదివించడం చేశారు. నగరంలోని యూనివర్సిటీల్లో స్టడీ సర్కిల్స్‌ నిర్వహణ, పుస్తకాలు, సినిమాలు, ఆర్ట్‌పై సదస్సులు, సభలు నిర్వహించేవారు. 

యాత్రలు.. ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్‌.. 
దక్షిణ భారతదేశం మొత్తం యాత్రలు చేయడం. ఇందులో భాగంగా ఫొటోగ్రఫీపై అభిరుచి ఏర్పడింది. ఆయ ప్రాంతాల సంస్కృతిని, వైవిధ్యాన్ని, ప్రకృతిని, ఆర్కిటెక్చర్‌ను కెమెరా లెన్స్‌లోంచి చిత్రించారు. వాటిని యూనివర్సిటీల్లో, పట్టణాల్లో ప్రదర్శించారు. 

సినిమా రంగంలోకి.. 
దర్శకులు అనుదీప్‌ కేవీ సాహిత్య పాఠకుడిగా ఉన్న రోజుల్లో నుంచి స్నేహం వల్ల సినిమాల్లోకి ప్రవేశం దొరికింది. ఆయన కథలను చర్చిస్తుడడం.. రాస్తుండడం.. ఆ క్రమంలోనే ప్రిన్స్‌ సినిమాకు రచన విభాగంలో పని చేయడం.. రచన నైపుణ్యాన్ని నేర్చుకోవడం జరిగింది.   

అత్యంత మరపురాని క్షణాలు.. 
కుబేర షూటింగ్‌ మొదలవుతుంది అనుకున్న రెండు నెలల ముందు  పిలిచారు. మొదట ఇంటర్న్‌షిప్‌ జాయిన్‌ అయ్యాను. యాత్ర అనుభవాల వల్ల ఈ సినిమా కథకు ముంబయి దగ్గర ఉండే లొకేషన్స్‌ వెతికిపెట్టే పని అప్పగించారు. చాల మేరకు హైదరాబాద్‌ లొకేషన్స్‌లో ఓకే చేయించుకోవడం.. క్రమంగా ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌కి ఇన్‌ఛార్జిగా ఉండడం.. లెజెండరీ మనుషులైన తోట తరణి, శేఖర్‌ కమ్ముల నేతృత్వంలో పనిచేయడం.. జీవితంలో ఓ మైలురాయి. 

డైరెక్టర్‌ విజన్, ప్రొడక్షన్‌ డిజైనర్‌ విజువల్‌ని సెట్‌లో ప్రతిబింబిచడానికి నిద్రాహారాలు పక్కనపెట్టి పనిచేశా.. అయినా కష్టం అనిపించలేదు.. సెట్‌లో తరణి, శేఖర్‌ అనుభవాలు వినడం జీవితంలో అత్యంత మరపురాని క్షణాలుగా ఉండిపోయాయి. ఆర్ట్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఇంద్రాణితో సమన్వయంలో ఉండడం.. టీం చరణ్, రాజు, భార్గవ్‌లతో రాత్రి, పగలు ఆడుతూ.. పాడుతూ షూటింగ్‌ కంప్లీట్‌ చేశాము. నేను, మా టీం ఇప్పుడు వీస్తున్న విజయపు గాలిని ప్రశాంతంగా ఆస్వాదిస్తున్నాం. 
 – అరవింద్‌ ఏవీ, అసోసియేట్‌ డైరెక్టర్‌ 

(చదవండి: అర ఎకరం భూమి లేకుండానే డ్రాగన్‌ పంట..! రిటైర్డ్‌ ఉపాధ్యాయురాలి సక్సెస్‌ స్టోరీ)

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)