Breaking News

రేస్‌ స్టార్‌

Published on Sat, 04/25/2026 - 03:24

వైట్‌ అండ్‌ వైట్‌ సూట్, కళ్ళకి నల్ల కళ్ళజోడు... గంభీరమైన చూపు...  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ బూత్‌ దగ్గర కనిపించిన అజిత్‌.. ఓటర్లు రికార్డు స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకున్నా, ఉదయం అందరికంటే ముందు వచ్చి ఓటు వేసిన అజిత్‌ గురించే తమిళనాడు మొత్తం ఈరోజు మాట్లాడింది. అజిత్‌ ను చూస్తే ఎంజిఆర్‌ను చూసినట్లే ఉందంటూ సామాన్య ప్రజలు మాట్లాడుకున్నారు.

సినిమాల్లోనే కాదు సినీ ప్రపంచానికి ఆవల కూడా అజిత్‌ జీవితం ఆసక్తికరం. ఒకసారి ఫోటోగ్రఫీ, మరోసారి డ్రోన్ టెక్నాలజీ, ఇప్పుడు కార్‌ రేసింగ్‌... సినిమాకు అవతల ఎన్నో....

కార్‌ రేసింగ్‌... ఒక హీరోని తలచుకోగానే అతను నటించిన సినిమా సన్నివేశాలో, డైలాగులో డ్యాన్సులో...గుర్తుకొస్తాయి. కానీ తమిళ స్టార్‌ హీరో అజిత్‌ గుర్తొస్తే సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌ నుంచి ఆయన కార్‌ రేసింగ్‌ హాబీ దాకా మరెన్నో గుర్తొస్తాయి. 

తెరపై టాప్‌ హీరోల్లో ఆయన ఒకరు కానీ తెరవెనుక మాత్రం ఆయన ఒక్కరే. ఆయన గత సెప్టెంబర్‌లో ‘54 ఏళ్ల అజిత్‌ కుమార్‌ రేసింగ్‌’ పేరుతో తన జట్టును కూడా ప్రారంభించారు. ఇటీవల బెల్జియంలో జరిగిన ఒక ప్రధాన కార్‌ రేసింగ్‌ ఈవెంట్‌లో అజిత్‌ జట్టు రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది. అలా యూరప్‌లో విజయవంతమైన కార్‌ రేసింగ్‌ ప్రదర్శన తర్వాత తమిళనాడు సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడం కోసం చెన్నైకి తిరిగి వచ్చారు.

సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌... సాదా సీదాగా కనిపించే హీరోల్లో అజిత్‌ ముందున్నా ఆయన స్టైల్స్‌ ఎప్పుడూ టాక్‌ ఆఫ్‌ ద టౌన్  అవుతూనే ఉంటాయి. చెన్నై విమానాశ్రయంలో అజిత్‌ తన ట్రేడ్‌మార్క్‌ సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌తో సాధారణ దుస్తులలో రిలాక్స్‌డ్‌గా, నిరాడంబరంగా కనిపించినప్పటికీ.. ఆయన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యాయి. 

అనేక మంది ఆయన లుక్‌ను ‘క్లాసీ లుక్‌’ అని ‘అప్రయత్నంగా స్టైలిష్‌’ అని అభివర్ణించారు. నిజానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేకమంది సెలబ్రిటీలకు అనుసరణీయంగా మారిన ఈ సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌ పరిచయం చేసింది ఆయనే. ఆ మాట కొస్తే... ఆయన లుక్‌లో మాత్రమే కాదు ఆయన జీవితంలో కూడా వెలుగు నీడలు చాలానే ఉన్నాయి. ఆ విషయాలు ఆయనే పలు మార్లు పంచుకున్నారు కూడా.

కొన్ని పరిణామాల నేపథ్యంలో ఇటీవలే అజిత్‌ దుబాయ్‌లో నివసించాలని నిర్ణయించుకున్నారు. ‘‘ప్రధానంగా మోటార్‌ స్పోర్ట్స్‌ కోసమే ఈ నిర్ణయం. ఎందుకంటే ప్రధాన సర్క్యూట్‌లు అన్నీ ఇక్కడే జరుగుతాయి’’ అని ఆయన చెప్పారు. గత 2025లో ‘విడాముయార్చి’ ’గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ చిత్రాలు విడుదలైన తర్వాత, అజిత్‌ తన దృష్టిని మరింత ఎక్కువగా రేసింగ్‌ వైపు మళ్లించారు.

స్వంతంగా వంట... తన పనులన్నీ తానే స్వయంగా చూసుకోవాలనే తన నిర్ణయం గురించి మాట్లాడుతూ ‘నేను మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాను. నాకు అడ్వాన్స్ డ్‌గా ఆలోచించే అద్భుతమైన తల్లిదండ్రులు ఉన్నారు, మా పనులు స్వయంగా చేసుకునేలా మమ్మల్ని పెంచారు. మాకు చిన్న వయసులోనే వంట నేర్పించారు’ అని అజిత్‌ అంటారు.

– ఎస్‌. సత్యబాబు, సాక్షి, హైదరాబాద్‌

Videos

నీకేంటి నొప్పి.. MP చిన్నిపై కొలికపూడి ఫైర్

TRS: కవితక్క కొత్త పాట

ఆడుకుంటూ ఆడుకుంటూ ఘోర ప్రమాదం.. బుడ్డోడిని కాపాడిన పోలీసులు

నేను నోరు విప్పితే వాళ్ల కాపురాలు కూలిపోతాయ్

రేపటి నుంచి చూస్తరు.. నా పని ఎట్లా ఉంటదో.. కవిత మాస్ వార్నింగ్

డార్లింగ్ రీ రిలీజ్ లో రచ్చ ప్రభాస్ ఫ్యాన్ ని చితకబాదిన థియేటర్ సిబ్బంది

అధికారంపై కవిత ధీమా, సీఎం కర్కోటకుడు అంటూ విమర్శలు

మూడో కంటికి తెలియదు.. చేతికి మట్టి అంటదు.. అదే చంద్రబాబు విజన్

అమెరికాకు ఇరాన్ షరతులు.. హార్ముజ్ లో హై టెన్షన్

GTపై RCB ఘన విజయం

Photos

+5

30 నిమిషాల డీల్‌.. ట్రెండింగ్‌లో పరిణితీ-రాఘవ్‌ చద్దా జోడి (ఫొటోలు)

+5

గ్లోబల్ స్పా అవార్డ్స్ వేడుకలో గ్లామర్‌ క్వీన్స్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : బంగారు కాంతుల్లో అందాల కాంత! (ఫొటోలు)

+5

భార్యతో కలిసి ప్రియదర్శి హిమాలయ ట్రిప్ (ఫొటోలు)

+5

తండ్రికి శ్రీముఖి బర్త్ డే విషెస్ (ఫొటోలు)

+5

ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. డిపోలకే పరిమితమైన బస్సులు (ఫొటోలు)

+5

సతీమణితో శ్రీవారిని సేవలో డైరెక్టర్ బాబీ (ఫొటోలు)

+5

రెడ్ డ్రస్‌లో రకుల్ ప్రీత్ సింగ్ రచ్చ (ఫొటోలు)

+5

క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండుల్కర్‌ బర్త్‌డే.. ఈ ఫొటోలు చూశారా?

+5

హైదరాబాద్‌లో కొత్త పార్క్.. ఈ వేసవి సెలవుల్లో ఓ లుక్కేయండి (ఫొటోలు)