Breaking News

అప్పుడే తెలిసిపోయింది

Published on Sun, 12/07/2025 - 04:00

తన ప్రయాణం ప్లాన్‌ చేసినదేం కాదు. కాని, విధి పిలుపును మాత్రం ఆమె విన్నది. అలా హైదరాబాద్‌ వీధుల్లో పానీపూరీ తింటూ నవ్వుకున్న సాదాసీదా అమ్మాయి– 
నేడు తెరపై సహజ మంత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆమె శివాని నాగారం. ఆమె విషయాలు ఆమె మాటల్లోనే మీ కోసం!

⇒ చిన్నప్పటి నుంచే నేర్చుకున్న కూచిపూడి నాట్యం నాకు ఒక థెరపీలా ఉంటుంది. ఏదైనా టెన్షన్‌ ఉన్నా, కొన్ని స్టెప్స్‌ వేస్తే చాలు, మనసంతా రిలాక్స్‌ అయిపోతుంది.
⇒ హైదరాబాద్‌లోనే పెరిగాను. అందుకే రోడ్డు పక్కన నిలబడి మిర్చి బజ్జీ, పానీపూరీ తినడం, సాయంత్రం రోడ్ల మీద కార్లు వెళ్లే శబ్దం వినడం ఇవన్నీ నా చిన్న చిన్న ఆనందాలు.

⇒ సినిమాల్లోకి రావడం నేను ముందే ప్లాన్‌ చేసుకున్న విషయం కాదు. కాని, నా ప్రయాణం పెద్ద తెరతో కాదు, చిన్న కథలతోనే మొదలైంది. ఒక చిన్న షార్ట్‌ఫిల్మ్‌లో కొద్దిసేపు మాత్రమే కనిపించినా, అలా మొదటిసారి కెమెరా ముందు నిలబడ్డ ఆ క్షణంలోనే ‘ఇదే నా దారి’ అని నాకు స్పష్టంగా తెలిసిపోయింది.
⇒ మొదటి సినిమా ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌’ విడుదలైనప్పుడు మనుసులో కొంచెం భయం ఉన్నా, ప్రేక్షకులు చూపిన ప్రేమ ఆ భయాన్ని పూర్తిగా కరిగించింది.

⇒ రెండో, మూడో సినిమాలు వచ్చేటప్పటికి నాలోనే ఒక కొత్త శివానిని చూసుకున్నాను. ప్రతి పాత్ర నాకు ఒక కొత్త నేర్పు, ఒక కొత్త అనుభవం ఇచ్చింది.
⇒ పూలంటే నాకు ప్రత్యేకమైన ప్రేమ. ఏ పువ్వైనా చేతిలో తీసుకుని అలా తిరగేస్తూ, వాసన చూస్తూ ఉండటం నాకు హాబీలా మారిపోయింది.

⇒ కథలు చదవడం నా అలవాటు. పెద్ద నవలలు కాకుండా, హృదయానికి హత్తుకునే చిన్న కథలు బాగా నచ్చుతాయి.
⇒ ఫ్యాషన్‌ విషయానికి వస్తే నేను చాలా సింపుల్‌. ఒక మంచి జీన్స్, క్లీన్స్ గా ఉండే కుర్తా, చిన్న చెవిపోగులు. అంతే, నేను సిద్ధం.

⇒ చర్మ సంరక్షణ విషయంలో నేను ఎక్కువ క్రీములు వాడను. రోజూ తగినంత నీళ్లు తాగడం, రాత్రి మాయిశ్చరైజర్‌ మాత్రం తప్పనిసరి. వారానికి ఒకసారి పెసరపిండి రాసుకుంటే చాలు, చర్మం బాగా ఫ్రెష్‌గా మారుతుంది.
⇒ నాకు ఇష్టమైన రంగులు పింక్‌లోని మృదువైన షేడ్స్, లైట్‌ బ్లూ.
⇒ అభిమానులతో మాట్లాడటం నాకు చాలా ఇష్టం. వాళ్ల కామెంట్లు, మెసేజులు, వారి ప్రేమ– అవన్నీ నాకు కొత్త శక్తి ఇస్తాయి.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)