Breaking News

ఆ తాతగారి లైఫ్‌స్టైల్‌కి ఫిదా అవ్వాల్సిందే..!

Published on Thu, 02/19/2026 - 11:47

ఇటీవలకాలంలో అందరిలో ఆరోగ్య స్ప్రుహ ఎక్కువైంది. మంచి ఆహారపు అలవాట్లు,వర్కౌట్లతో హెల్దీగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరు ప్రోటీన్‌ పౌడర్లు, జిమ్‌లు వంటి వాటితో ఆరోగ్యకరమైన వృద్ధాప్య జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. కానీ ఈ తాత అంతలా ఆరోగ్యం కోసం ఏమాత్రం ఖర్చు చేయకుండానే..చాలా చురుకుగా, దీర్ఘాయువుతో ఉండటం విశేషం. ఈ ఏజ్‌లో కూడా అన్ని పనులు తానే చాలా యాక్టివ్‌గా చేసుకుంటున్న తీరుకి ఫిదా అవ్వాల్సిందే. మరి అతడి ఆరోగ్య రహస్యం ఏంటో చూద్దామా..

ఆ తాత గారి గురించి ఆయన మనవరాలు కంటెంట్‌ క్రియేటర్‌ 28 ఏళ్ల సింధూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రూపంలో పోస్ట్‌ చేయడంతో అది నెట్టింట సంచలనంగా మారడమే కాదు, ప్రశంసలు వెల్లువెత్తాయి. తన తాతగారికి దగ్గర దగ్గర 95 ఏళ్ల ఉంటాయని, ఆయన రిటైర్డ్‌ అనస్థీషియాలజిస్ట్‌ అని వీడియోలో వివరిస్తోంది సింధు. ఆమె తన తాతగారి రోజు ఉదయం 5.30 గంటలకు యోగాతో ప్రారంభమవుతుందని, పదవీవిరమణ చేసి రెండు దశాబ్దాలకు పైనే అవుతున్నా..ల్యాప్‌టాప్‌లో వైద్య సాహిత్యం గురించి చదవడం, కొత్త సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకోవడం వంటి వాటితో కాలక్షేపం చేస్తారు. 

వీటి అన్నింటి తోపాటు అప్పుడప్పుడు షాపింగ్‌ ట్రిప్పులు, రోజువారీ పూజ, ధ్యానం, యాప్‌లు లేకుండా సాధన చేయడం తదితరాలు ఉన్నాయి. ఇవేగాక తన వంటను తానే చేసుకుంటారని, "మినీ ఇడ్లీలు" వండటంలో మంచి నిపుణుడని చమత్కరిస్తోంది. ఆయన రిటైర్‌ అయ్యాక కూడా వైద్యవృత్తిపై ఆసక్తి ఏమాత్రం తగ్గలేదని, ఇప్పటికీ వాటికి సంబంధించినవి చదవడం, ఆర్టికల్స్‌ రాయడం వంటివి చేస్తుంటారని చెబుతోంది. 

ఆయన తమిళనాడులోని మధురైలో చాలా ఏళ్లుగా అనస్థీషియాలజిస్ట్‌గా పనిచేసినట్లు పేర్కొంది. తన తాతగారి రోజువారీ దినచర్య దీర్ఘకాల ఆరోగ్యానికి ఖరీదైన ధోరణులతో పనిలేదని నిరూపించింది. ఇప్పటికీ ఆయన హ్యాపీగా వాక్‌ చేస్తారు, వంటకూడా చేసుకుంటారు, కొత్తకొత్త నైపుణ్యాలను నేర్చుకుంటుంటారు. పైగా ఆయన ఎలాంటి జిమ్‌ సభ్యుత్వం లేకుండా, కనీసం సప్లిమెంట్లపై ఆధారపడకుండా.. జస్ట్‌ శ్రద్ధ అనే రెండు అక్షరాల పదంపై ఫోకస్‌ పెట్టి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడని సింధు చెపుకొచ్చింది. 

దక్షిణాసియా హిందూ సంప్రదాయల్లో వందల ఏళ్ల నుంచి రోజువారీ కదలికలు, భావోద్వేగాలపై నియంత్రణ, మానసిక స్పష్టత తదితరాలు ఉన్నాయి. అయితే వాటిని కంటిన్యూ చేసేలా జీవన విధానంలో భాగమైతే తన తాతలా సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవితాన్ని గడపొచ్చని అంటోంది. చిన్న చిన్న వాటిల్లో కూడా ఆనందాన్ని వెతుక్కునే మనస్తత్వం ఉన్నవారికి ఎదురే ఉండదని, అది వారికి బలోపేతంగా ఉండేలా సామర్థ్యాన్ని అందిస్తుందని అంటోంది.

 

(చదవండి: అంబానీల ఆడపడుచు కోడలు.. లెహంగా ధర తెలిస్తే షాక్‌!)

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)