Breaking News

మోడ్రన్‌ బామ్మ..! ఆమె చేసే వర్కౌట్లు చూస్తే షాకవుతారు!

Published on Mon, 06/16/2025 - 16:03

తొమ్మిది పదుల వయసులో చాలా చలాకీగా ఓ బామ్మ వ్యాయామాలు చేసేస్తోంది. ఆ క్రమంలోనే ఆమె ఒక్కసారిగా నెటిజన్లను ఓ రేంజ్‌లో ఆకర్షించింది. యంగ్‌గా ఉండేవాళ్లు సైతం చేయలేని వ్యాయమాలను ఈ బామ్మ 90ల వయసులో సునాయాసంగా చేసి ఆశ్చర్యపరుస్తోంది. ఆ ఏజ్‌లో ఉండే కీళ్ల సమస్యలు, కాళ్ల నొప్పులు వంటివి ఏమి లేవు ఆమెకు. పైగా వృద్ధాప్యాన్ని ఇంతలా ఆరోగ్యకరంగా నిర్వహించుకోవచ్చని చాటిచెప్పింది. జీవితం అనేది ఆస్వాదించడానికేనని, అది మన చేతుల్లోనే ఉంది అని క్లియర్‌గా చెప్పింది. ఇంతకీ ఎవరా బామ్మ అంటే..

చైనాకు చెందిన ఈ బామ్మ పేరు లీ. ఆమెకు పుష్‌ అప్‌, సిట్‌ అప్‌లు చేయడం వెన్నతో పెట్టిన విద్య అన్నట్లు వేస్తుందామె. ఇరవై, ముప్పైలలో ఉండే యువత సైతం చేయడానికి ఇబ్బండిపడే కష్టతరమైన వర్కౌట్లన్ని బామ్మ లీ హుషారుగా చేసేస్తుంది. ఆమె హునాన్ ప్రావిన్స్‌లోని జియాంగ్వా యావో అటానమస్ కౌంటీలో నివసిస్తోంది. నిజానికి ఆ ప్రాంతంలో నిరంతరం వర్షాలు పడుతూనే ఉంటాయి. అయితే ఆ వర్షం కూడా ఆమె ఉత్సాహాన్ని నియంత్రించలేకపోయింది. 

అంటే ఆమె తన వ్యాయామాలు ఇంట్లోనే చేసుకునేలా చక్కగా సర్దుబాటు చేసుకుంది. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం ఆమె అభిరుచి అని చెప్పొచ్చు. అంతలా నిబద్ధతతో చేస్తోందా బామ్మ. పైగా ఆమె ప్రతిరోజూ 200 పుష్-అప్‌లు, 100 సిట్-అప్‌ల మిస్‌అవ్వకుండా చూసుకుంటుందట. జూన్ ప్రారంభంలో యావో ఎత్నిక్ మైనారిటీ మెడిసిన్ ఫెస్టివల్ సందర్భంగా ఆ బామ్మ తన ఆరోగ్యకర అలవాట్లు వెలుగులోకి వచ్చి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. 

అంతేగాదు ఆమె తన దీర్ఘాయువు సీక్రెట్‌ని కూడా షేర్‌ చేసుకుంది. ప్రతి రాత్రిపూట  పాదాలను వేడినీళ్లలో ఉంచే అవాట్లతో కాళ్ల నొప్పులను తగ్గించుకున్నానంటోంది. మంచి ఆహారపు అలవాట్లతో జుట్టు నెరిసిపోకుండా చూసుకుంటుందట. ఇక తన చలాకి కదలికలకు కారణం 1959లో చాంగ్షాలోని కళాశాల నుండి పట్టభద్రురాలైన వెంటనే  కిండర్ గార్టెన్ టీచర్‌గా పనిచేయడమేనని అంటోందామె. ఎందుకంటే పిల్లలు కదలికలు చాలా అద్భుతంగా ఉంటాయి. వారిలో ఉండే చురుకుదనం తనకెంతో ఇష్టమని అంటోంది. అలానే యాక్టివ్‌గా జీవితాంతం ఉండాలనే ఆకాంక్ష..ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేలా చేసిందని అంటోంది బామ్మ లీ.

వయస్సుతో పాటు మన శరీర కదలికలు తగ్గుతాయి..దాన్ని గమనించి మంచి ఆరోగ్య అలవాట్లు, జీవనశైలిని సరిచేసుకుంటే.. వృద్ధాప్యంలో ఎవ్వరిపై ఆధారపడకుండా..ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆశ్వాదించగలమని చెబుతోంది ఈ బామ్మ. నెటిజన్లు సైతం ఆమె కథని విని..ఆమె మాములు బామ్మ కాదంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

(చదవండి: UK: సీక్రెట్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌కు సారథిగా ఆమె..! 115 ఏళ్ల చరిత్రలో..)

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)