Breaking News

లేటు వయసులో వెయిట్‌ లాస్‌ జర్నీ..! గుర్తుపట్టలేనంత స్లిమ్‌గా బామ్మ..

Published on Thu, 11/13/2025 - 17:27

బరువు తగ్గడం అనే ప్రక్రియ కాస్త యంగ్‌ ఏజ్‌లోనే ప్రారంభిస్తాం. అది వాళ్ల ఆహార్యం, హెల్త్‌ సమస్యల రీత్యా ఇంకాస్త మందు లేదా 40 నుంచి 50,60ల వయసులో మొదలు పెడతారు. అంతకుమించి మరీ లేటు వయసులో..అది కూడా విశ్రాంతి తీసుకునే వయసులో ఎవ్వరూ మొదలుపెట్టే సాహసం చేయరు. కానీ ఈ బామ్మ అలా కాదు. ఏడు పదలు వయసులో బరువు తగ్గాలనుకోవడమే కాదు, ఆ వయసులో కష్టతరమైన కసరత్తులు చేసి గుర్తుపట్టలేనంత నాజూకుగా మారిపోయింది. పైగా ఫిట్‌నెస్‌ టిప్స్‌ చెప్పేస్తోంది.

కెనడాలోని ఒంటారియాకు చెందిన 79 ఏళ్ల జోన్ మెక్‌డొనాల్డ్‌ అసాధారణమైన సాహాసానికి పూనుకుని బరువు తగ్గాలనే ఔత్సాహికులకు స్ఫూర్తిగా నిలిచారామె. వయసు కేవలం నెంబరేనని ప్రూవ్‌చేసింది. అంతేగాదు 70 ఏళ్ల వయసులో జిమ్‌లో వర్కౌట్లు చేసి ఔరా అనిపించుకుంది. దాదాపు ఎనిమిదేళ్లుగా అధిక బరువుతో ఉండేదాన్ని అని ఇన్‌స్టా వేదికగా తన వెయిట్‌ లాస్‌ స్టోరీ షేర్‌ చేసుకుందామె. 

తాను ప్రతి భోజనంలో ప్రోటీన్‌ ఉండేలా కేర్‌ తీసుకున్నట్లు తెలిపింది. బరువు తగ్గడం అనేది ఎప్పుడూ కష్టతరమైన ప్రక్రియ కాదు. కూరగాయలు, ఫైబర్‌పై ఫోకస్‌ పెడుతూ..కండరాలను బలోపేతం చేసేలా వ్యాయామాలు చేస్తే చాలంటోంది ఈ బామ్మ జోన్‌. ముఖ్యంగా గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉండేలా ఎలాంటి వర్కౌట్లు చేస్తే బెటర్‌ అనేది తెలుసుకున్నానని వివరించింది. అందుకోసం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ప్రారంభించినట్లు తెలిపింది. 

వార్మప్‌ నుంచి మొదలుపెట్టి..వేగవంతంగా చేసే వ్యాయామాలు దాదాపు 60 నుంచి 70 నిమిషాలు కొనసాగేవని చెప్పుకొచ్చింది. అంతేగాదు ప్రతి నెల తనలో వస్తున్న పరివర్తనను గమనించానని, అదీగాక తాను మరింత బలంగా ఫిట్‌గా ఉన్నట్లు అనిపించిందని వెల్లడించింది. 

ఇక వర్కౌట్ల పరంగా బామ్మ వారానికి రెండు లెగ్‌ సెషన్‌లు, రెండు అప్పర్ బాడీ, ఒక గ్లూట్-ఫోకస్డ్ సెషన్  తప్పనిసరిగా చేసేదాన్ని అని అంటోదంది ఈ బామ్మ. ఏ వయసులో వెయిట్‌లాస్ ప్రక్రియ ప్రారంభించినా..డెడికేషన్‌ మస్ట్‌ అప్పుడే సత్ఫలితాలు పొందగలరని చెప్పకనే చెప్పింది కదూ ఈ బామ్మ జోన్.

 

(చదవండి: పెళ్లి వేడుకలో కిరణ్‌ మజుందార్ షా, సుధామూర్తిల స్టెప్పులు..!)

 

 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)