నో జిమ్‌, నో సప్లిమెంట్లు..! 75 ఏళ్ల వయసులోనూ ఆ అమ్మమ్మ..

Published on Tue, 08/11/2026 - 12:17

జీవితంలో ఏదో ఒక దశలో ఒంటిరిగా జీవించక తప్పని పరిస్థితి ఎదురవుతుంటుంది. దాంతో చాలామంది బెంగగా ఫీలవ్వతూ బతకేందుకు ఆందోళన చెందుతుంటారు. కొందరు మాత్రం ఒకరికీ భారంగా కాకుండా హుషారుగా, మంచి అభిరుచిని ఏర్పరుచుకుని సాగిపోతుంటారు. ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తుంటారు. అలాంటి కోవకు చెందిందే ఈ 75 ఏళ్ల అమ్మమ్మ. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

ఈ బామ్మ 'పరివృత్త జాను శిరాసన', 'ఉత్థిత పద్మాసనం', 'బైసెప్ కర్ల్స్', 'సీటెడ్ ఫార్వర్డ్ బెండ్' వంటి యోగాసనాలను ఎంతో సునాయాసంగా వేసేస్తుంటుంది. అంతేగాదు ఆమె బరువు కూడా ఆరోగ్యకరమైన స్థిరమైన బరువుని మెయింటైన్‌ చేయడం విశేషం. చాలామంది ఇదెలా మీకు సాధ్యం అని అడుగుతుంటారు. నిజం చెప్పాలంటే ఒకప్పుడు ఆమెకు ఫిట్‌నెస్ గురించి ఆలోచించడానికి సమయమే దొరికేది కాదు. ఎందుకంటే 15 ఏళ్లకే పెళ్లై, ఉమ్మడి కుటుంబంలో అడుగుపెట్టింది. 

ఉదయం 5 గంటలకు ప్రార్థనలతో మొదలై, ఆరు గంటలకల్లా సందడిగా మాపోయేది. వంట చేయడం నుంచి చేతితో బట్టలు ఉతడకం, పిల్లలను పెంచడం, ప్రతిరోజు అతిథులు రావడం తదితర పనులతో గడిచిపోయేది. ఆమె అందరినీ చూసుకోవడంలో పడి, తనని తాను చూసుకోవడం మర్చిపోయానని చెప్పుకొచ్చింది. తన జీవితంలో క్లిష్ట దశ ఒకటి ఉందంటూ..ఆ దురదృష్టకరమైన పరిస్థితిని గుర్తుతెచ్చుకొన్నారు. పదేళ్ల క్రితం భర్త చనిపోవడం మొత్తం పరిస్థితి మారిపోయిందని చెప్పుకొచ్చింది. 

ఎందుకంటే ఒక్కసారిగా ఇల్లంతా నిశబ్దంగా మారిపోయింది. ఒంటరితనం ఆవహించేస్తున్నా..దాన్ని అదిగమించేలా మేడమీదకు వెళ్లి స్ట్రెచింగ్  చేయడం మొదలుపెట్టింది. టీవీలో యోగాసనాలను చూడటం లేదా దగ్గర్లో ఎవరైనా సాధన చేస్తుంటే గమనించడం చేస్తుండేది..అలా ఆమె జీవితంలో యోగా ఒక దినచర్యగా మారిపోయింది. అంతేగాదు ఆమె రోజు.. ఉదయం నాలుగు గంటలకు మొదలవుతుంది. వాకింగ్‌ , యోగా, పుస్తకాలు చదవడం, ఇల్లంతా శుభ్రం చేయడం వంటి పనులతో ముగుస్తుంది. 

తన ముగ్గురు కుమార్తెలు, కుమారుడు వేర్వేరు ప్రదేశాల్లో నివశిస్తున్నారని, కొందరు విదేశాల్లో ఉన్నారని, వాళ్లంతా తన గురించి ఆందోళన చెందకుండా ఉండేలా బతుకుతున్నానని అన్నారు. అలాగే పొరుగువారికి పాపడ్‌లు వంటి ఇతర పనుల్లో సహాయం చేస్తుంటానని అన్నారు. బహుశా అందుకేనేమో 75 ఏళ్ల వయసులో కూడా జీవితం నెమ్మదించిందని అనిపించదు. 

ఇప్పటికీ ప్రతి ఉదయం ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలనే ఉత్సాహంతో నిద్రలేస్తాను అలా ఒంటిరితనాన్ని జయించి, అర్థవంతంగా మార్చుకున్నానని చెప్పుకొచ్చింది. అందువల్లే స్థిరమైన ఆరోగ్యకరమైన బరువుతో ఉన్నట్లు తెలిపారు. ఎలాంటి జిమ్‌, సప్లిమెంట్లు మాత్రం లేవు అని చమత్కరిస్తూ రాసుకొచ్చారు పోస్ట్‌లో. 

 

(చదవండి: సహారా ఎడారి అడుగున దాగున్న అద్భుతాలు.. కాలగర్భంలో కలిసిపోయిన రహస్యాలు ఇవే!)
 

Videos

భారతి సిమెంట్స్ కేసులో కూటమి ప్రభుత్వానికి గట్టి షాకిచ్చిన హైకోర్టు

చిరు NEXT మూవీ టైటిల్ లీక్.. వద్దు వద్దు అంటున్న ఆపుకోలేక నోరు జారిన చిరంజీవి

ఆ సీఐ చుట్టూ కూటమి రాజకీయం..!

LB నగర్ పీఎస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య

కేకును కోస్తే అరెస్ట్ చేసి నడి రోడ్డుపై నడిపించారు.. మెడికల్ విద్యార్థిని ప్రియాంకను చంపేస్తే మాత్రం వారిని

నేడు MLA, MLCలతో వైఎస్ జగన్ కీలక సమావేశం

నా కాలు విరిగినా.. నా ప్రాణం పోతాదన్నా జగనన్న కోసం ఎలాంటి కష్టానైనా...

EVM ట్యాపరింగ్ జరిగిందో లేదో చంద్రబాబే చెప్పాలి..! ఉండవల్లి అరుణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్

రాజమండ్రి పోలీసులు అందరూ ఎలాంటివారంటే..! డాక్టర్ ప్రియాంక ఘటనపై అడ్వకేట్ బాల కామెంట్స్

నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేసి... సీదిరి అప్పలరాజు భార్య సంచలన వ్యాఖ్యలు

Photos

+5

హైదరాబాద్‌లో మొదలైన వినాయక చవితి 2026 సందడి (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌...(ఫొటోలు)

+5

‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌...ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)

+5

హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు)

+5

ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు)

+5

ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు)

+5

యంగ్ హీరోతో నయన్ లవ్ పోజులు (ఫొటోలు)

+5

‘అగధ’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం క్యూట్ ఫ్యామిలీ.. వెకేషన్ (ఫొటోలు)