Breaking News

స్పానియార్డ్స్‌ జయకేతనం

Published on Tue, 07/21/2026 - 01:02

ఆటపై అంకితభావం... అవతలి జట్టుపై గెలవటానికి పక్కా వ్యూహం... తిరుగులేని క్రమశిక్షణ... అన్నిటికీ మించి జట్టు మొత్తం ఒక వ్యవస్థగా పనిచేయటం సోమవారం వేకువజామున న్యూజెర్సీ వేదికగా ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. సాకర్‌ ప్రపంచ కప్‌ సంరంభంలో మొదట్లో ఎవరికీ పెద్దగా అంచనాలు లేని స్పెయిన్‌ జట్టు అందరినీ అధిగమించి విశ్వవిజేతగా నిలిచింది. క్రీడాభిమానుల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. ఇలాంటి ఘట్టాలు సాకర్‌ చరిత్రలో బహుశా అరుదుగా నమోదైవుంటాయి. అలాగని స్పెయిన్‌ తక్కువేం కాదు. అది తొలిసారిగా 2010లో దక్షిణాఫ్రికాలో ప్రపంచకప్‌ సాధించింది. అంతక్రితం సాకర్‌ యూరో కప్‌ను మూడుసార్లు – 1964, 2008, 2012లలో గెలుచుకుంది. ఒకరకంగా 2008 నుంచి 2012 వరకూ అది ప్రపంచ ఫుట్‌బాల్‌ను శాసించిందని చెప్పాలి. 

కానీ అనంతరకాలంలో దాదాపు కనుమరుగయ్యే స్థితికి చేరింది. మొదట్లో స్పెయిన్‌కు విజయపరంపర అందించిన ‘టికి–టాకా’ వ్యూహం (ఆటగాళ్లు బంతిని పాస్‌లు ఇచ్చుకుంటూ తమమధ్యే ఉంచుకోవటం), గోల్‌ పోస్ట్‌ వైపు వెళ్లే చొరవ తగ్గటానికి దారితీసింది. ప్రత్యర్థులు సులభంగా అంచనావేసే స్థితి ఏర్పడింది. దిగ్గజా లనదగ్గ జావి, ఇనియెస్టా, కార్లెస్, సెర్గియో రామోస్‌ వంటి ఆటగాళ్లు వరసగా నిష్క్రమించినప్పుడు ఆ ఖాళీలను భర్తీ చేయటంలో బోర్డు విఫలమైంది. కొత్తగా వచ్చినవారికి అంతర్జాతీయ టోర్నీల ఒత్తిడిని తట్టుకునే అనుభవం లేకపోయింది. అయితే కాలం మారింది. లామిన్‌ యామాల్‌ వంటి యువ సంచలనం, ఫెర్రాన్‌ టోరెస్‌ వంటి సమర్థుడు చరిత్ర తిరగరాశారు.  

అటు అర్జెంటీనా అసామాన్యమైనది. నిన్న మొన్నటివరకూ దానివైపు తలెత్తి చూడటానికి కూడా ప్రత్యర్థులు సాహసించనంతటి అరివీరభయంకర జట్టు. మారడోనా, మెస్సీ వంటి సార్వకాలిక మహా దిగ్గజాలను ప్రపంచానికందించిన ఆ దేశం ఎప్పుడూ ఫుట్‌బాల్‌లో తిరుగులేని శక్తిగానే ఉంది. 1978, 1986, 2022లలో అర్జెంటీనా ఆటగాళ్లు మహాద్భుతాలను ప్రదర్శించి దేశాన్ని విశ్వవిజేతగా నిలిపారు. దక్షిణమెరికా ఖండంలో అత్యున్నత టోర్నమెంటు అయిన ‘కోపా అమెరికా’లో ఏకంగా 16 సార్లు ఆ టైటిల్‌ను గెలిచిన చరిత్ర అర్జెంటీనా ఆటగాళ్లది. మెస్సీది అద్భుతమైన నైపుణ్యం. చెప్పాలంటే అతనిది భావోద్వేగంతో ముడిపడివుండే మాయాజాలం. అది ఇన్నాళ్లూ రాణించింది. ప్రత్యర్థులు దరిదాపుల్లోకి రావటం కూడా అసాధ్యమనిపించే రీతిలో పనిచేసింది. కానీ భారమంతా మెస్సీపైనే పడటం ఆ జట్టుకు పెద్ద మైనస్‌ అయికూర్చుంది. అవతల స్పెయిన్‌ ఆటగాళ్లు ఉక్కు క్రమశిక్షణతో, అంకితభావంతో ఆడి మ్యాచ్‌పై పూర్తి నియంత్రణ సాధించిన తీరు అర్జెంటీనాను కోలుకోలేని దెబ్బతీసింది. 

ఒలింపిక్స్‌ అయినా, సాకర్‌ వంటివైనా ప్రపంచ దేశాలమధ్య సద్భావనను పెంపొందించే సందర్భాలు. నిన్న మొన్నటివరకూ కలహాలతో చెలరేగిపోయిన దేశాల ఆటగాళ్లు ఆ యుద్ధంరేపిన గాయాలు మరిచి పరస్పరం చేతులు కలపడం గుర్తుంచుకోదగిన క్షణాలవుతాయి. ఈసారి ఆతిథ్య దేశాల్లో ఒకటైన అమెరికా ప్రపంచ దేశాలను అష్ట కష్టాలు పెడుతూ పగబట్టినట్టు ప్రవర్తిస్తూ వచ్చింది. ఆఖరికి సాకర్‌ సాగుతున్న దశలో కూడా అది ఇరాన్‌పై క్షిపణిదాడులతో చెలరేగిపోయింది. ఆ చీడను ఇరాన్‌ ఆటగాళ్లకూ పులిమింది. ప్రాక్టీసింగ్‌ మ్యాచ్‌లు ఇక్కడ కుదరదంటూ విమానాశ్రయంనుంచే వెనక్కి పంపింది. చివరకు వారు మెక్సికోలో బసచేసి, అక్కడే ప్రాక్టీస్‌ చేసుకోవాల్సి వచ్చింది. ఆట ముగిసీ ముగియగానే మెక్సికో వెళ్లటానికి విమానాశ్రయానికి తరలించేది. అన్ని అవమానాలనూ దిగమింగుకుంటూనే అమెరికా క్రీడాభిమానులుసహా ప్రపంచమంత టినీ ఇరాన్‌ జట్టు అలరించింది. 

మొత్తానికి అమెరికా అగ్రరాజ్య దురహంకారానికి కొత్తగా వచ్చిచేరిన జాత్యహంకారం ఈ సాకర్‌లో కొన్ని చేదు అనుభవాలు మిగిల్చింది. పట్టనట్టున్న ఫిఫా దానికి లొంగి స్వీయ ప్రతిష్ఠను కోల్పోయింది. మైదానంలో రిఫరీదే తుది నిర్ణయంకాగా, ట్రంప్‌ జోక్యంతో దాన్ని మార్చటం ఫిఫా బలహీనతకు చిహ్నం. మొత్తానికి ఫుట్‌బాల్‌ అందం దాని దిగ్గజాలు ప్రదర్శించే క్రీడా నైపుణ్యంలో ఉంటుంది. భిన్నమైన ఆట శైలులుగల మెస్సీ, రొనాల్డో, ఎర్లింగ్‌ హాలండ్‌ వంటివారు అభిమానులకు శాశ్వతంగా మిగిలే ఆనందకర క్షణాలను అందించారు. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)