Breaking News

Hyd: యువకుడిని హత్యచేసి ఇన్‌స్టాలో రీల్‌

Published on Mon, 04/08/2024 - 10:13

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని బాచుపల్లిలో భయంకరమైన ఘటన జరిగింది. తేజస్‌(21) అలియాస్‌ సిద్దూను అనే యువకుడిని కొంత మంది యువకులు అతి కిరాతకంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. చంపడమే కాకుండా ఆ ఘటనను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడం కలకలం రేపింది. 

బాచుపల్లి పోలీసు స్టేషన్‌లో పరిధిలోని ప్రగతి నగర్‌లో తేజస్‌ అద్దె ఇంట్లో తన తల్లితో కలిసి ఉంటున్నాడు. తన తల్లి ఊరు వెళ్లటంతో.. ఆదివారం రాత్రి తేజస్‌ తన మిత్రులైన మహేశ్‌, శివస్ప, సమీర్‌లతో కసిలి మద్యం తాగాడు. సోమవారం తెల్లవారుజూమున ప్రగతి నగర్‌లోని బతుకమ్మ ఘాట్‌ వద్ద ఉన్న తేజస్‌ను గతంలో హత్యకు గురైన తరుణ్‌ స్నేహితులు బైక్‌లపై వచ్చి దారుణంగా పొడిడి చంపారు. హత్య చేసిన తర్వాత యువకులు రీల్‌ చేసి ఇస్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ప్రతీకారంగానే తాము హత్య చేసినట్లు ఆ పోస్టులో వాళ్లు పేర్కొన్నారు.

ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గత ఏడాది తరుణ్‌ అనే వ్యక్తి హత్య కేసులో సిద్దూ ఏ3గా ఉ‍న్నట్లు తెలుస్తోంది. పాత కక్షల నేపథ్యంలో.. ఆ హత్యకు ప్రతీకారంగానే తేజస్‌ను హతమార్చినట్లు స్పష్టత వచ్చింది.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి