Breaking News

భార్య మిస్సింగ్‌ అంటూ 12 మంది భర్తల ఫిర్యాదు.. ఫోటో చూడగానే పోలీసులకు దిమ్మ తిరిగింది!

Published on Sun, 07/16/2023 - 14:21

పెళ్లంటే ఇద్దరు వ్యక్తులు ఒక్కటిగా చేసే ఓ వేడుక. జీవితంలో ఇదొక మధురమైన జ్ఞాపకంగా కూడా భావిస్తుంటాం. అంతటి ప్రాముఖ్యం ఉంది గనుకే ప్రజలు వివాహాల కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు. అయితే కొందరు మాత్రం ఈ వివాహ బంధాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అడ్డదారులు తొక్కడమే కాకుండా ఎంతటి దారుణాలకైన పాల్పడేందుకు వెనకాడడం లేదు.  తాజాగా, జమ్మూకాశ్మీర్‌లో ఓ కిలాడీ డబ్బుల కోసం ఏకంగా ఒకరు ఇద్దరు కాదు 27 మందిని పెళ్లి చేసుకొని మోసం చేసింది.

స్కెచ్‌ వేసిందిలా
వివరాల్లోకి వెళితే.. జమ్మూ కాశ్మీర్ లోని వివిధ ప్రాంతాలలో తమ భార్య కనిపించడం లేదంటూ 12 మంది యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యువకులు ఇచ్చిన ఫొటోలు చూసిన పోలీసులు షాకయ్యారు. ఆ 12 మంది భర్తలు ఇచ్చిన ఫొటోలలో ఉన్నది ఒకే మహిళ కావడమే అందుకు కారణం. దీనిపై కాస్త లోతుగా పోలీసులు విచారణ జరపగా.. కాస్త అటూఇటూగా అందరు చెప్పిన స్టోరీ ఒకేలా ఉంది. ఓ యువతి మధ్యవర్తి సాయంతో పెళ్లి చేసుకోవడం, కొన్ని రోజుల కాపురం చేశాక ఏదో ఒక కారణం చెప్పి కనిపించకుండా పోవడం.. పోతూ పోతూ ఇంట్లో ఉండే డబ్బు, నగలతో ఉడాయించడం.

ఇలా ఆ కిలేడి ఒకరిద్దరు కాదు ఏకంగా 27 మందిని యువకులను పెళ్లి చేసుకుని మోసం చేసింది. అయితే అనుకోకుండా వీరిలో 12 మంది మాత్రమే పోలీస్‌ స్టేషన్‌ వరకు రావడంతో ఈ బండారం మోత్తం బయటపడింది.  27 మందిని పెళ్లి చేసుకొని 20 రోజులు వారితో ఉండి.. డబ్బు, బంగారంతో పారిపోయిందని సమాచారం. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ఫొటో ఆధారంగా మాయలేడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయం గురించి తెలిసిన వారు రకరకాలుగా అనుకుంటున్నారు.

చదవండి   స్నేహితుడికి సెండాఫ్‌ ఇచ్చి వస్తూ..

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)