Breaking News

బర్త్‌డేకు దుబాయ్‌ తీసుకెళ్లలేదని భర్తను గుద్ది చంపేసింది

Published on Sun, 11/26/2023 - 06:12

పుణె: తన పుట్టినరోజును పురస్కరించుకుని దుబాయ్‌కు తీసుకెళ్లి వేడుక చేయలేదనే వీరావేశంతో భర్తను భార్య పిడిగుద్దులు కురిపించి చంపేసిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పుణెకు చెందిన 38 ఏళ్ల నిఖిల్‌ ఖన్నా వాన్‌వాడియా ప్రాంతంలో వ్యాపారం చేస్తుండేవారు. అతనికి 36 ఏళ్ల భార్య రేణుక ఉంది.

ఆమె పుట్టినరోజు సెప్టెంబర్‌ 18. అదే రోజున తనను దుబాయ్‌కు తీసుకెళ్లి పుట్టినరోజు వేడుక జరపాలని పట్టుబట్టింది. అందుకు భర్త ససేమిరా అన్నాడు. ఈ నెల ఐదో తేదీన వీరి వివాహ వార్షికోత్సం జరిగింది. ఆ రోజూ తనకేమైనా ప్రత్యేక బహుమతులు ఇస్తాడేమో అని ఆశపడి భంగపడింది. ఢిల్లీలోని తన బంధువుల వేడుకలకూ వెళ్లాలని భావించినా అదీ నెరవేరలేదు.

ఒకదాని వెంట మరోటి ఏ ఒక్క ఆశ తీరకపోవడంతో నవంబర్‌ 24వ తేదీన భర్తతో వాగ్వాదానికి దిగింది. తీవ్ర వాదులాట సందర్భంగా వీరావేశంతో భర్త ముఖంపై పిడిగుద్దులు కురిపించింది. దీంతో ముక్కు నుంచి రక్తం కారుతూ అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. భార్యభర్త ఘర్షణ పడుతున్న విషయం తెల్సి ఇరుగుపొరుగు వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి భర్తను వెంటనే దగ్గర్లోని ససూన్‌ జనరల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే ఆయన ప్రాణం పోయిందని వైద్యులు ధృవీకరించారు.

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)