Breaking News

ఒకరి వెంట ఒకరు.. మృత్యుఒడికి

Published on Wed, 11/27/2024 - 10:33

వెల్గటూర్‌(ధర్మపురి): ఆ ముగ్గురూ స్నేహితులు.. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. కలిసే చదువుకున్నారు, ఆడుకున్నారు.. చివరికి మృత్యువులోనూ ఒకరి వెంట ఒకరు వెళ్లిపోయారు.. వెల్గటూర్‌ మండలంలోని స్తంభంపల్లి అనుబంధ గ్రామం కొత్తపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఆ ముగ్గురి కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. ప్రమాదం రోజే ఒకరు, ఆ తర్వాత రోజు విడిచి రోజు మరో ఇద్దరు చనిపోవడంతో స్వగ్రామం పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగూడూర్‌లో విషాదం నింపింది. 

వివరాల్లోకి వెళ్తే.. కుక్కలగూడూర్‌కు చెందిన నల్లపు అవినాశ్‌(19), బడుగు సాగర్‌(19), కుదిరె సాగర్‌(18) మంచి స్నేహితులు. గత శుక్రవారం స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యేందుకు బైక్‌పై ధర్మపురి మండలంలోని రాయపట్నం వైపు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వెల్గటూర్‌ మండలంలోని కొత్తపల్లి స్టేజి వద్ద 7వ నంబర్‌ రాష్ట్ర రహదారిపై ఎదురుగా ఎటువంటి సిగ్నల్‌ ఇవ్వకుండా వచ్చిన ట్రాక్టర్‌ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ముగ్గురికీ తల పగిలి, తీవ్ర గాయాలయ్యాయి. అవినాశ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మిగతా ఇద్దరిని కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బడుగు సాగర్‌ ఆదివారం, కదిరె సాగర్‌ మంగళవారం చనిపోయారు.

అందరివీ పేద కుటుంబాలే..
బడుగు రవికి ఒక కూతురు, కొడుకు సాగర్‌ సంతానం. సాగర్‌ డిగ్రీ ఫస్టియర్‌ చదువుతున్నాడు. కదిరె గట్టయ్యకు ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు సాగర్‌ డిగ్రీ ఫస్టియర్‌ చదువుతున్నాడు. వీరిద్దరివి వ్యవసాయ కుటుంబాలు. నల్లపు తిరుపతికి ఒక కూతురు, కుమారుడు అవినాశ్‌ ఉన్నారు. అవినాశ్‌ ఇంటర్‌ పూర్తి చేశాడు. తిరుపతి మద్యానికి బానిసై, కుటుంబాన్ని పట్టించుకోడు. అవినాశ్‌ తొలుత పెట్రోల్‌ బంకులో పని చేశాడు. ప్రస్తుతం టెంట్‌హౌస్‌లో పనిచేస్తూ తల్లి, అక్కను పోషిస్తున్నాడు. చేతికందిన కుమారులు తమకు వృద్ధాప్యంలో తోడుగా ఉంటారనుకుంటే రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో మృతుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అందరివీ పేద కుటుంబాలేనని, ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఈ రోడ్డుపై నిత్యం ప్రమాదాలు..
ఎండపల్లి మండలంలోని రాజారాంపల్లి నుంచి రాయపట్నం వరకు ఉన్న రోడ్డు(15 కి.మీ.)పై నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయి. గడిచిన రెండేళ్లలో 20 మందికి పైగా మృతిచెందారు. ఈ రోడ్డుపై గుంతలు ఎక్కువగా ఉన్నాయి. మరమ్మతు చేయకపోగా కనీసం ప్రమాద సూచికలు కూడా ఏర్పాటు చేయలేదు. గ్రామ కూడళ్లలో వీధి దీపాలు సక్రమంగా లేకపోవడం వంటి కారణాలతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అధికా రులు స్పందించి, రోడ్డుకు మరమ్మతు చేయించా లని ప్రజలు కోరుతున్నారు.

 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)