Breaking News

ముగ్గురు బీటెక్‌ విద్యార్థుల అదృశ్యం

Published on Tue, 12/24/2024 - 07:45

ఇబ్రహీంపట్నం: వారం రోజుల్లో ముగ్గురు బీటెక్‌ విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఇబ్రహీంపట్నం పీఎస్‌ పరిధిలోని గురునానక్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ హాస్టల్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనలు సోమవారం ఆలస్యంగా వెలుగుచూశాయి. మిస్సింగ్‌ అయిన వారిలో ఇద్దరూ మైనర్లు కావడం గమనార్హం. స్థానిక ఎస్‌ఐ రామకృష్ణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

 వికారాబాద్‌ జిల్లా, మోమిన్‌పేట మండలం రాంనాథ్‌గుడపల్లికి చెందిన కొత్తగాడి బాల్‌రాజ్‌ కుమారుడు (17) ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్‌ విద్యాసంస్థల్లో బీటెక్‌ (సీఎస్‌సీ) ప్రథమ సంవత్సరం చదువుతూ కాలేజ్‌ హాస్టల్‌లో ఉంటున్నాడు.14న హాస్టల్‌ నుంచి వెళ్లిపోయాడు. తండ్రి బాల్‌రాజ్‌ విష్ణుకు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయకపోవడంతో మరుసటి రోజు నేరుగా కాలేజ్‌కి వచ్చి ఆరా తీయగా.. సిబ్బంది నిర్లక్ష్యంగా మాట్లాడారని ఆరోపించారు. ఇదిలా ఉండగా యాదాద్రి జిల్లా ఆత్మకూర్‌ మండలం, కాప్రాయిపల్లికి చెందిన మరో విద్యార్థిని(17) గురునానక్‌ కాలేజ్‌లో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతూ ఇదే కళాశాల హాస్టల్‌లో ఉంటోంది. 

ఈ నెల 17న సాయంత్రం 6 గంటల నుంచి కనిపించకుండా పోయింది. అలాగే వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన 19 సంవత్సరాల విద్యారి్థని ఈనెల 20న అదృశ్యమైంది. ఈమె కూడా కాలేజ్‌ హాస్టల్‌లో ఉంటూ బీటెక్‌ ఫస్టియర్‌ చదువుతోంది. వారం రోజుల్లో ముగ్గురు విద్యార్థులు అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ విషయంలో యాజమాన్యం  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. కాలేజీ నిర్వాహకులు, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)