Breaking News

విజయవాడలో టీడీపీ నేత ఘరానా మోసం.. రూ.6 కోట్లతో పరార్‌!

Published on Wed, 07/26/2023 - 15:52

సాక్షి, విజయవాడ: నగరంలోని భానునగరంలో చిట్టీల పేరుతో టీడీపీ నేత ఘరానా మోసానికి పాల్పడ్డాడు. చిట్టీల పేరుతో టీడీపీ నేత పతివాడ అప్పలనాయుడు జనాన్ని నిండా ముంచారు. సుమారు 300 మంది నుంచి రూ.6 కోట్లు వసూలు చేసి పరారయ్యాడు. బాధితులు గుణదల పోలీసులను ఆశ్రయించారు. న్యాయం చేయాలంటూ అప్పలనాయుడి ఇంటి వద్ద బాధితుల ధర్నా చేపట్టారు.

‘సాక్షి’తో బాధితులు మాట్లాడుతూ, చిటీల పేరుతో నమ్మించి మోసం చేశాడని, రోజువారీ కూలీకి వెళ్తూ చీటీ కట్టామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.5 లక్షలు, రూ.10లక్షలు చిటీలు కట్టిన వాళ్లం వందల్లో ఉన్నాం. చిటీ పూర్తయిన తర్వాత కూడా ఇవ్వకుండా తన వద్దే ఉంచుకుని వడ్డీ ఇస్తానని మోసం చేశాడు. ఏడాదిగా డబ్బు ఇవ్వకుండా మోసం చేశాడు. ఐపీ పెట్టినట్టు నోటీసులు వచ్చాయి. మాకు న్యాయం చేయాలి’’ అని బాధితులు కోరుతున్నారు.
చదవండి: మచిలీపట్నంలో ప్రముఖ వైద్యుడి భార్య దారుణ హత్య

కాగా, పతివాడ అప్పలనాయుడు.. గత పదేళ్లుగా చిట్టీలు, ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్నాడు. క్రమం తప్పకుండా చెల్లింపులు చేస్తుండటంతో పాటు అధిక వడ్డీలు ఇవ్వటంతో పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు అప్పలనాయుడు వద్ద వారు దాచుకున్న నగదును వడ్డీలకు ఇచ్చుకునేవారు. ఈ క్రమంలో అప్పల నాయుడు అందినంత వరకు వసూలు చేసుకుని గత పదిరోజులుగా అదృశ్యమయ్యాడు. తాజాగా సోమ, మంగళవారాల్లో అప్పలనాయుడు కొంతమందికి ఐపీ నోటీసులు పంపించటంతో బాధితులు తమకు జరిగిన మోసాన్ని గ్రహించి లబోదిబోమంటున్నారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)