Breaking News

టీడీపీ నేత బండారం బట్టబయలు.. సింగర్‌తో సహజీవనం చేసి..

Published on Thu, 04/20/2023 - 08:27

నరసరావుపేట టౌన్‌(పల్నాడు జిల్లా): పెళ్లి కాలేదని మాయమాటలు చెప్పి దళిత యువతిని దగా చేసిన తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాఖమూరి మారుతి నవీన్‌ బండారం బట్టబయలైంది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు బుధవారం రాత్రి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నరసరావుపేటలోని చంద్రబాబు కాలనీకి చెందిన ఓ దళిత యువతి  ఆర్కెస్ట్రాలో పాటలు పాడేది.

ఆమెకు రొంపిచర్ల మండలం సుబ్బాయపాలెంకు చెందిన తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాఖమూరి మారుతి నవీన్‌తో నాలుగేళ్ల క్రితం పరిచయమైంది. తనకు వివాహం కాలేదని నమ్మబలికిన నవీన్‌ ఆమెతో సహజీవనం చేశాడు. ఆమె గర్భం దాల్చడంతో తక్కువ కులం దానివని దూషిస్తూ ఆమెను వదిలించుకునే ప్రయత్నం చేశాడు. ఆమె కేసు పెడతానని చెప్పగా.. 2019 అక్టోబర్‌ 24న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు.

అనంతరం బరంపేటలో కాపురం పెట్టాడు. 2020 మార్చిలో ఆమెకు బాబు జన్మించాడు. కాగా, నవీన్‌కు అప్పటికే మరో యువతితో వివాహమైన విషయం బాధితురాలికి తెలిసింది. ఈ విషయంపై నిలదీయడంతో దళిత యువతిని మానసికంగా వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఇంటికి రాకుండా ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేశాడు. వేరే నంబర్‌ను వినియోగిస్తున్నాడని తెలిసి ఫోన్‌ చేయగా ఇంటికి వచ్చి ఆమెపై దాడి చేసి బలవంతంగా ఇంటినుంచి బయటకు నెట్టాడు. ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వీరేంద్రబాబు బుధవారం తెలిపారు.

నవీన్‌పై పేకాట, బెట్టింగ్‌ కేసులు
నవీన్‌పై గతంలో క్రికెట్‌ బెట్టింగ్, పేకాట నిర్వహణ కేసులు నమోదయ్యాయి. అయినప్పటికి టీడీపీ ముఖ్యనేతలు అతడికి రాష్ట్ర పదవి కట్టబెట్టి, పదవిలోనే కొనసాగిస్తున్నారు. దళిత యువతిని మోసం చేసి రోడ్డు పాల్జేయడంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితుణ్ణి అరెస్ట్‌ చేసి బాధిత మహిళకు న్యాయం చేయాలని పలువురు దళిత నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.
చదవండి: వద్దన్నందుకు చంపేశాడు.. బ్యూటీషియన్‌ దుర్గ మృతిలో వీడిన మిస్టరీ

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)