Breaking News

ప్లీజ్‌ ఇలా మాత్రం డ్రైవింగ్‌ చేయకండి.. స్పాట్‌లోనే మృతి

Published on Fri, 07/21/2023 - 10:52

మంగళూరు: అతివేగం ఎంత ప్రమాదకరమో ఇప్పటికే పలు సందర్భాల్లో చూసి ఉంటాం. హైస్పీడ్‌ కారణంగా ఎందరో ప్రాణాలు సైతం కోల్పోయారు. ఇక, రోడ్డు ప్రమాదాలపై పోలీసులు ఎంతగా ప్రచారం, అవగాహాన కల్పిస్తున్న కొందరు పెడచెవిన పెడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు స్పాట్‌లోనే మృతిచెందాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల ప్రకారం.. కర్నాటక రాష్ట్రం మంగళూరులో ఘోర ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న నిషాత్‌(21) హైస్పీడ్‌లో అదుపుతప్పి డివైడర్‌ మధ్యలో ఉన్న కరెంట్‌ పోల్‌ను ఢీకొట్టాడు. ఈ క్రమంలో బైక్ మీదున్న యువకుడు గాల్లోకి ఎగిరిపడ్డాడు. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే నిషాంత్‌ చనిపోయాడు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యాక్సిడెంట్ జరిగిన తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు.

ఇదిలా ఉండగా.. యువకుడు గాల్లోకి ఎగరడం చూస్తే.. బైక్ ను ఎంత వేగంగా నడుపుతున్నాడో అర్థమవుతుంది. ఇక, మృతుడిని ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. అడయార్ సహ్యాద్రి ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: మణిపూర్‌ ఘటన:. ప్రధాన నిందితుడి ఇంటి తగలబెట్టి.. కుటుంబాన్ని బహిష్కరించిన గ్రామస్తులు

Videos

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు