Breaking News

ఘోర ప్రమాదం.. చిన్నారి సహా ఎనిమిది మంది మృత్యువాత

Published on Sun, 05/07/2023 - 19:45

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న మినీ వ్యాన్‌ను ట్రక్కు ఢీకొట్టడంతో ఓ చిన్నారి సహా ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. మరో 12 మందికిపైగా గాయాలయ్యాయి. మోరాదాబాద్‌ జిల్లాలోని ఖైర్‌ఖాతా గ్రామ సమీపంలోని దల్పత్‌పూర్‌-కాశీపూర్‌ రహదారిపై ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. ఓ వివాహ వేడుకకు హజరయ్యేందుకు కుటుంబ సభ్యులు, బంధువులంతా వ్యాన్‌లో వెళ్తున్నారు. ఇంతలో అతివేగంతో వెళ్తున్న ట్రక్కు పికప్‌ వ్యాన్‌ను ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది.

ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో వ్యాన్‌పై లారీ బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వ్యాన్‌లో ప్రయాణిస్తున్న చాలా మంది ప్రయాణికులు శిథిలాల కింద చిక్కుకుపోవడంతో అధికారులు.. చాలా కష్టం మీద వారిని బయటకు తీశారు.  ఈ ఘటనలో 15 మంది గాయపడగా వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో రెండు వాహనాల్లో ప్రయాణికులు ఉన్నారు.
చదవండి: పుల్వామాలో ఉగ్రకుట్ర భగ్నం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)