Breaking News

బెయిల్‌పై బయటకొచ్చి.. భార్య, ముగ్గురు పిల్లలపై కాల్పులు

Published on Tue, 11/05/2024 - 19:12

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. హత్య కేసులో బెయిల్‌ బయటకు వచ్చిన ఓ వ్యక్తి.. తన భార్య, ముగ్గురు పిల్లలను అతి కిరాతకంగా కాల్చి చంపాడు. ఈ ఘోరం వారణాసిలోని భైదానీ ప్రాంతంలో సోమవారం అర్థరాత్రి వెలుగుచూసింది.

పోలీసుల వివరాల ప్రకారం.. రాజేంద్ర గుప్తా అనే వ్యక్తి 1997కు సంబంధించి ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యాయడు. సోమవారం రాత్రి తన ఇంట్లోకి ప్రవేశించి గాఢ నిద్రలో ఉన్న భార్య నీతూ గుప్తా(45), కుమారులు నవేంద్ర(25), సుబేంద్ర(15), కూతురు గౌరంగి(16)పై కాల్పులు జరిపాడు. వారు మరణించారని ధృవవీకరించుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు.

కుటుంబం హత్యపై సమాచారం అందుకున్న వారణాసి పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే నిందితుడు సైతం వారణాసిలోని రోహనియా ప్రాంతంలో శవమై కనపించాడు. తన భార్య, పిల్లలను చంపిన తర్వాత నిందితుడు హత్య చేసుకొని మరణించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా కొన్ని రోజులుగా బార్యభర్తల మధ్య వివాదాలు జరుగుతున్నాయని రాజేంద్ర గుప్తా తల్లి పోలీసులకు తెలిపారు.

ఈ సంఘటనపై వారణాసి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్  గౌరవ్ బన్స్వాల్ మాట్లాడుతూ.  ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని కాల్చి చంపినట్లు తమకు సమాచారం అందిందని చెప్పారు. కుటుంబ కలహాలు, చేతబడి వంటి అనేక కోణాల్లో మేము కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రాజేంద్ర గుప్తా మృతదేహాన్ని కూడా వారణాసి నుంచి స్వాధీనం చేసుకున్నామని, అతను హత్యకు గురయ్యాడా లేదా ఆత్మహత్య చేసుకొని మరణించాడా అని తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)