Breaking News

ద్విచక్ర వాహనంపై ఒంటరిగా మహిళ.. పొదల్లోకి లాక్కెళ్లి..

Published on Fri, 01/06/2023 - 16:23

కోడూరు(అవనిగడ్డ) కృష్ణా జిల్లా: దుకాణంలో పని ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఒంటరిగా వెళ్తున్న మహిళపై గుర్తుతెలియని వ్యక్తి లైంగిక దాడికి యత్నించారు. ఈ ఘటన కోడూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కోడూరు మండలం మందపాకల గ్రామానికి చెందిన మహిళ (35) కోడూరులోని ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తోంది.

ఆమె ప్రతి రోజూ ద్విచక్ర వాహనంపై ఉదయం దుకాణానికి వచ్చి పని ముగించుకొని తిరిగి రాత్రికి ఇంటికి వెళ్తుండేది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి సదరు మహిళ దుకాణంలో పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఇస్మాయిల్‌బేగ్‌పేట సమీపంలోని చెరువు వద్ద గుర్తు తెలియని వ్యక్తి ఆమె చీరకొంగును పట్టుకొని లాగాడు. దీంతో మహిళ బైక్‌ పైనుంచి కింద పడిపోవడంతో ఆమెను బలవంతంగా పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకువెళ్లి లైంగికదాడికి యత్నించాడు.

మహిళ కేకలు వేసేందుకు ప్రయత్నించగా నిందితుడు ఆమె ముఖం, చేతిపై దాడి చేసి, నోరు మూసి హత్యాయత్నానికి ప్రయత్నించాడు. అదే సమయంలో రహదారి వెంట వెళ్తున్నవారు మహిళ కేకలు విని అటుగా వెళ్లగా నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడు ముఖానికి మంకీ క్యాప్‌ ధరించి ఉన్నాడు. ఈ ఘటనలో బైక్‌పై నుంచి పడిపోవడం వల్ల మహిళ కాలుకు బలమైన గాయం, చేతికి, ముఖానికి స్వల్ప గాయాలయ్యాయి. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆమెను చికిత్స నిమిత్తం అవనిగడ్డ ఆస్పత్రికి తరలించారు.
చదవండి: మేనమామతో పెళ్లి.. భర్త తీరు బాగోలేదంటూ వివాహిత షాకింగ్‌ ట్విస్ట్‌

వివరాలు సేకరించిన సీఐ శ్రీనివాస్‌..  
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అవనిగడ్డ సీఐ శ్రీనివాస్‌ బాధిత మహిళను అడిగి తెలుసుకున్నారు. కోడూరు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ను పరిశీలించి వెంటనే నిందితుడిని పట్టుకోవాలని ఆదేశించారు. కోడూరు, నాగాయలంక పీఎస్‌లకు సంబంధించిన పోలీసులతో రెండు బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నామని సీఐ తెలిపారు. 

Videos

స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేశాం

Covid-19 New Variant: తొందరగా సోకుతుంది..

మీరు కూడా పుస్తకాలు తీసి పేర్లు రెడీ చేయేండి..

YSRCP హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు: YS Jagan

పెళ్ళైన రెండో రోజే మృత్యుఒడికి నవవరుడు

LIVE: మనకూ టైం వస్తుంది.. వాళ్లకు సినిమా చూపిస్తాం

MISS INDIA: తిరుమల శ్రీవారి సేవలో మానస వారణాసి

బెంగళూరులో రోడ్లు, కాలనీలు జలమయం

రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లతో సమావేశం

హీరోయిన్ సాయి ధన్సిక తో విశాల్ వివాహం

Photos

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)

+5

ఐదో రోజు సరస్వతీ నది పుష్కరాలు..భక్తజన సంద్రం (ఫోటోలు)

+5

విశాల్‌తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)

+5

ముంచెత్తిన కుండపోత.. నీట మునిగిన బెంగళూరు (ఫొటోలు)

+5

జూ.ఎన్టీఆర్ బర్త్ డే.. ఈ విషయాలు తెలుసా? (ఫొటోలు)

+5

పెళ్లయి మూడేళ్లు.. నిక్కీ-ఆది హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)