Breaking News

పిన్ని కుమారుడితో సంబంధం.. భర్త హత్యకు రూ. 5 లక్షల సుపారీ!

Published on Tue, 02/14/2023 - 10:14

బెంగళూరు: జీవితాంతం తోడునీడగా ఉంటానని పెళ్లిలో ప్రమాణం చేసిన భార్య దారి తప్పి కట్టుకున్నోడిని కడతేర్చింది. పిన్ని కుమారుడితో అక్రమ సంబంధం పెట్టుకుని భర్తను హత్య చేయడానికి రౌడషీటర్లకు భార్య రూ. 5 లక్షల సుపారీ ఇచ్చి పరలోకానికి పంపించిన వైనమిది. కర్ణాటక రాష్ట్రం   తుమకురు జిల్లాలోణి కుణిగల్‌ తాలూకాలోని సీనప్పనహళ్ళి గ్రామానికి చెందిన మంజునాథ్‌ హత్యకు అతని భార్య హర్షిత (20) కిరాయి ఇచ్చింది.

ఈ కేసులో ఆమెను, ఆమె పిన్ని కుమారుడు రఘు, ఇతని మిత్రుడు రవికిరణ్‌లను పోలీసులు అరెస్టు చేశారు.  పోలీసులు తెలిపిన ప్రకారం మంజునాథ్‌ ఫిబ్రవరి 3వ తేదీన కుణిగల్‌ పట్టణంలో స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని మళ్లీ సీనప్పనహళ్ళి గ్రామంలోని సొంత ఇంటికి వచ్చి నిద్రపోయాడు. 

అర్ధరాత్రి బయటకు పిలిచి హత్య..  
అతనికి అర్ధరాత్రి ఫోన్‌ రావడంతో మాట్లాడుతూ బయటికి వెళ్లిపోయాడు. ఆపై మళ్లీ ఇంటికి రాలేదు. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కిత్న మంగళ చెరువులో మంజునాథ్‌ శవమై తేలాడు. దీంతో మంజునాథ్‌ కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి భార్య హర్షితను అరెస్టు చేశారు. ఆమె చెప్పిన వివరాలతో మిగతా ఇద్దరిని పట్టుకున్నారు.

భార్యే ఈ హత్య చేయించిందని గ్రామస్తులు కూడా ఆరోపించారు. రఘు, రవికిరణ్‌లు మంజునాథ్‌కు ఫోన్‌ చేయించి చెరువు వద్దకు పిలిపించారు. అక్కడ అతన్ని హత్య చేసి చెరువులో పడేసి వెళ్లినట్లు ఒప్పుకున్నారు. కేసు విచారణలో ఉంది.    

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)