నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ పేరు
Breaking News
వివాహేతర సంబంధం వద్దన్నందుకు..
Published on Thu, 08/26/2021 - 14:23
సాక్షి, హైదరాబాద్: వివాహితతో సంబంధం వద్దన్నందుకు స్నేహితుడిపై దాడి చేసిన సంఘటన సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రియాసత్‌నగర్ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ ఇసా (27), షాహీనగర్ ప్రాంతానికి చెందిన అక్బర్ ఖాన్ స్నేహితులు. కాగా ఈ నెల 24వ తేదీ రాత్రి రియాసత్‌నగర్‌లోని డికాషన్ హోటల్ వద్ద ఇసాను స్నేహితుడు అక్బర్ ఖాన్ కలిశాడు.
కాగా అక్బర్ ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో మహ్మద్ ఇసా మందలించాడు. దీంతో కోపోద్రిక్తుడైన అక్బర్ ఖాన్ కత్తితో ఇసా ముఖంపై దాడి చేశాడు. ఈ విషయం గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇసాను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఇసా ముఖంపై ఎనిమిది కుట్లు పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్బర్ ఖాన్‌ను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
చదవండి: ఓటుకు కోట్లు కేసు: రేవంత్, సండ్రలకు సుప్రీంలో ఊరట
Tags : 1