Breaking News

సహజీవనానికి అడ్డొస్తున్నాడని.. గొంతునులిమి, ప్రాణం తీసి..

Published on Mon, 11/02/2026 - 12:18

హైదరాబాద్‌, రహమత్‌నగర్‌: సహజీవనానికి అడ్డుగా ఉన్నాడని ఐదేళ్ల బాలుడి గొంతునులిమి అత్యంత దారుణంగా ప్రాణం తీశాడు.. తండ్రి వరస అయిన కిరాతకుడు. రాత్రంతా గదిలోనే ఉండి తెల్లవారుజామున తల్లి వచ్చాక నిలదీయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు.

బోరబండ ఎస్‌హెచ్‌వో రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌çకు చెందిన పవార్‌ దుర్గ(23) భర్త మధు కొంత కాలం క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఓ కుమారుడు, కుమార్తెను నిజామాబాద్‌లో ఉంటున్న బావ వద్ద ఉంచి.. çహృద్రోగ సమస్యతో బాధపడుతున్న చిన్న కొడుకు విజయ్‌(5)తో కలిసి దుర్గ బోరబండలో ఉండేది. ఫుట్‌పాత్‌పై ఇనుప వస్తువులు తయారు చేసే దుకాణంలో పనిచేసేది.

ఈ క్రమంలో నిజామాబాద్‌కు చెందిన నల్లవరపు విద్యాసాగర్‌(33)కు ఆమెతో పరిచయం ఏర్పడింది. నాలుగు నెలల క్రితం బోరబండ అజాంనగర్‌ బీబ్లాక్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని వీరు సహజీవనం చేస్తున్నారు. ఆమె ప్రైవేటు ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తుండగా.. అతడు పని వదిలేసి మద్యం తాగుతూ ఇంట్లోనే ఉండేవాడు. దుర్గ ఇంట్లో లేని సమయంలో బాలుడిని తరచూ కొట్టేవాడు.

ఆదివారం సాయంత్రం విజయ్‌ని ఇంట్లోనే వదిలి తల్లి నైట్‌ డ్యూటీకి వెళ్లింది. మద్యం మత్తులో ఇంటికి వచ్చిన విద్యాసాగర్‌ నిద్రిస్తున్న విజయ్‌ గొంతు నులిమి తీవ్రంగా కొట్టాడు. దీంతో బాలుడు ప్రాణాలు వదిలాడు. ఇంట్లోనే రాత్రంతా ఉన్నాడు. అనంతరం ఏమీ తెలియనట్లు దుర్గ పనిచేసే ఆసుపత్రికి ఫోన్‌ చేసి విజయ్‌కు ఫిట్స్‌ వచ్చి కిందపడిపోయాడని చెప్పాడు.

ఆమె ఇంటికి వచ్చి చూడగా విజయ్‌ చనిపోగా.. మెడపై గాయాలు కనిపించాయి. విద్యాసాగర్‌ను నిలదీయడంతో తలుపు మూసి ఆమె గొంతు నులిమే ప్రయత్నం చేశాడు. ఆమె అరుపులు విన్న చుట్టుపక్కల వారు రావడంతో పారిపోయాడు. జూబ్లీహిల్స్‌ డీసీపీ రమణారెడ్డి, ఎస్‌ఆర్‌ నగర్‌ ఏసీపీ రాఘవేంద్రరావు, బోరబండ ఎస్‌హెచ్‌వో రవికుమార్‌లు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: తిన్న ప్లేట్లను కడిగేందుకు వెళ్లి... విషాదం!

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)