Breaking News

Hit And Run: పూటుగా మద్యం సేవించి బాలిక ప్రాణం తీసిన యువతి

Published on Thu, 05/01/2025 - 14:34

జైపూర్‌ : రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. పీకల దాకా మద్యం తాగిన ఓ యువతి ఓ మైనర్‌ బాలిక ప్రాణం తీసింది. తన కారుతో బాలిక వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలిక ప్రాణాలు కోల్పోయింది.

పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి జైపూర్‌లోని సంగనీర్ గేట్ సమీపంలో హిట్‌ అండ్‌ రన్‌ ఘటన చోటు చేసుకుంది. 14 ఏళ్ల ఆసిమా తన తండ్రితో పాటు కజిన్‌తో కలిసి బైక్‌పై ఇంటికి వెళ్తున్నారు.

సరిగ్గా సంగనీర్‌ గేటు సమీపంలో పూటుగా మద్యం సేవించిన ఓ యువతి ఆసిమా బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆసిమా మృతి చెందింది. ఆమె తండ్రి, బంధువు తీవ్రంగా గాయపడ్డారు. అయితే బైక్‌ను ఢీకొట్టిన అనంతరం యువతి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. రాంగ్‌ రూట్‌లో వెళుతూ మరో బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనతో అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. నిందితులు ప్రయాణిస్తున్న కారును అడ్డగించారు.

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారమైన యువతిని, ఆమెతో పాటు కారులో ప్రయాణిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. బ్రీత్‌ ఎనలైజర్‌ టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టులో కారు డ్రైవ్‌ చేసిన యువతి అతిగా మద్యం సేవించినట్లు నిర్ధారించారు.

 పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నిస్తుండగా సదరు యువతి పోలీసుల్ని వేడుకుంటున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. కారు నడిపిన యువతి నాగ్‌పూర్‌కు చెందిన సంస్కృతిగా గుర్తించారు. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని మెడికల్ పరీక్ష నిర్వహించి అరెస్టు చేశారు. కారు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, లోతైన విచారణ ప్రారంభించారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)