Breaking News

తెల్లారితే కూతురి పెళ్లి.. ఆగిపోతుందనే భయంతో తండ్రి ఆత్మహత్య 

Published on Sun, 05/21/2023 - 09:18

సిద్దిపేట: తెల్లారితే కూతురు పెళ్లి...బంధువులందరికీ పెళ్లి పత్రికలు వెళ్లిపోయాయి. ఓ వైపు పెళ్లి ఏర్పాట్లు చేస్తూనే ఖర్చుల నిమిత్తం తెలిసిన వారందరి దగ్గరా అప్పుకోసం అడిగాడు. ఎక్కడా రూపాయి కూడా పుట్టలేదు. అటు చూస్తే బంధువులందరూ ఇంటికి వచ్చేస్తున్నారు. డబ్బులేక పెళ్లి ఆగిపోతే పరువు పోతుందని భావించిన ఆ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్‌ గ్రామపరిధిలోని ముత్తన్నపేటలో శుక్రవారం జరిగిన ఈ విషాద ఘటన వివరాలిలా ఉన్నాయి.

వేల్పుల అయిలయ్య (45) కూతురి వివాహం ఆదివారం జరగాల్సి ఉంది. పెళ్లి ఖర్చుల కోసం డబ్బు సమకూరకపోవడంతో తెలిసిన వారి వద్ద అప్పు కోసం యతి్నంచాడు. ఎక్కడా అప్పు లభించకపోవడంతో మనస్తాపం చెందాడు. దీంతో శుక్రవారం సాయంత్రం గదిలోకి వెళ్లి కొబ్బరితాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు అతడిని దించి చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. కుమారుడు వేల్పుల పవన్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

చదవండి: ఆటో, బొలెరో ఢీ.. ముగ్గురి దుర్మరణం 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)