Breaking News

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఏసీబీ లిస్టులో అధికారుల చిట్టా

Published on Tue, 03/26/2024 - 10:59

సాక్షి, హైదరాబాద్‌: ఫోన్ టాపింగ్ వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా అధికారులు భారీగా అక్రమ ఆస్తులు కూడా బెట్టుకున్నట్లు సమాచారం. పలువురు అధికారులపై ఏసీబీ దృష్టి సారించింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వ్యాపారులు, హవాలా ముఠాల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు తేలింది. వారి నుంచి వచ్చిన డబ్బుతో అధికారులు భారీగా సంపాదించారు.

విలాసవంతమైన విల్లాలో అధికారులు నివాసం ఉంటున్నట్లు ఏసీబీ గుర్తించింది. ఏసీబీ లిస్టులో ఫోన్ ట్యాపింగ్ పోలీసు అధికారులు చిట్టా, వారి ఆర్థిక పరిస్థితిని ఏసీబీ విశ్లేషిస్తోంది. ఆదాయానికికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటకకు చెందిన రాజకీయ నేతల ఫోన్లను కూడా ట్యాపింగ్‌ చేసినట్లు సమాచారం

నాంపల్లి కోర్టులో  కస్టడీ పిటిషన్‌
ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్‌ను పోలీసులు దాఖలు చేశారు. భుజంగరావు, తిరుపతన్న ప్రణీత్ రావు ముగ్గురిని కస్టడీ కొడుతూ పిటిషన్ వేశారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో నిందితులు ఉన్నారు. ఫోన్ టాపింగ్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. బడా వ్యాపారవేత్తలను, హవాలా దందా చేసే వారిని బెదిరించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రణీత్ రావు టీంలో పనిచేసిన అధికారులను నేడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు పిలిచి దర్యాప్తు బృందం విచారించనుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)