Breaking News

HYD: పోలీసు స్టేషన్‌లో కస్టోడియల్‌ డెత్‌!.. కారణం అదేనా? 

Published on Mon, 07/17/2023 - 09:37

సాక్షి, హైదరాబాద్‌: ఓ గొడవకు సంబంధించిన వ్యవహారంలో విచారించేందుకు తీసుకువచ్చిన సెక్యూరిటీ గార్డు పోలీస్‌స్టేషన్‌లోనే మృతి చెందాడు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నానక్‌రాంగూడలోని ఓ లేబర్‌ క్యాంపులో బిహార్‌కు చెందిన నితీశ్‌(32), బిట్టు, వికాస్‌లు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. 

అయితే, క్యాంపులోని కూలీలు శనివారం రాత్రి 11 గంటలకు బయటికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. వీరు అడ్డుకోవడంతో గొడవ జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు కూలీలకు గాయాలయ్యాయి. బాధితులు డయల్‌ 100కు కాల్‌ చేయడంతో గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయాలైన కూలీలను ఆస్పత్రికి తరలించి.. ముగ్గురు సెక్యూరిటీ గార్డులను అదుపులోకి తీసుకుని, విచారణ కోసం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే వీరిలో నితీశ్‌ ఆదివారం ఉదయం 7.55 గంటల సమయంలో ఒక్కసారిగా అపస్మారక స్థితికి వెళ్లాడు. 

పోలీసు సిబ్బంది అది గమనించి తొలుత సీపీఆర్‌ చేశారు. తర్వాత సమీపంలోని హిమగిరి ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపు చికిత్స చేసిన వైద్యులు నితీశ్‌ మృతి చెందాడని ప్రకటించారు. ఈ ఘటనపై మాదాపూర్‌ డీసీపీ శిల్పవల్లి వివరణ ఇస్తూ.. కూలీలు, సెక్యూరిటీ గార్డులకు మధ్య గొడవ జరగడంతో అదుపులోకి తీసుకున్నామని, ఛాతీలో తీవ్రనొప్పితో నితీశ్‌ మృతి చెందాడని తెలిపారు. ఘటనపై విచారణ జరుపుతామని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: జర జాగ్రత్త.. నెలలో రెండు లక్షల మందికి జ్వరాలు

Videos

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)