Breaking News

ఎక్కడివీ కరెన్సీ కట్టలు?

Published on Mon, 05/15/2023 - 13:19

హైదరాబాద్: నగరంలోని ఓ వ్యక్తి ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంతో రూ.1.65 కోట్ల నగదు బయటపడిన ఘటన గోపాలపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ సాయి ఈశ్వర్‌గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రెజిమెంటల్‌ బజార్‌లో నివసించే భైరి శ్రీనివాస్‌ అభిజిత్‌ ఎలక్ట్రికల్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఉత్పత్తి చేసే కంపెనీలో డీజీఎంగా పని చేస్తున్నారు. శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఆయన ఇంట్లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. అదే సమయంలో శ్రీనివాస్‌తో పాటు కుటుంబ సభ్యులు విశాఖపట్టణంలో ఉన్నారు. స్థానికులు వెంటనే గోపాలపురం పోలీసులు, ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను ఆరి్పవేశారు. గ్రౌండ్‌ ప్లోర్‌లోని గదిలో ఉండే పనికిరాని వస్తువులు, కొంత చెక్క సామగ్రి మంటల్లో కాలిపోయాయి. 

మంటలు పూర్తిగా ఆరిపోయిన తర్వాత రాత్రి 12 గంటల సమయంలో గోపాలపురం పోలీసులకు ఇదే ఇంట్లో కోట్ల రూపాయల నగదు ఉందనే సమాచారం అందింది. ఇన్‌స్పెక్టర్‌ సాయి ఈశ్వర్‌గౌడ్‌ ఉన్నతాధికారులకు సమాచారం అందించి ఇంటిని స్థానికులు, పోలీసులతో పాటు బంధువుల సమక్షంలో తెరిచారు. మొదటి అంతస్తులోని బెడ్రూంలో గాలించారు. మంచం కింద, అల్మారా తదితర ప్రాంతాల్లో గాలించగా రూ.1.65 కోట్ల నగదు లభించింది. ఇందులో 50 మాత్రమే రూ.2 వేల కరెన్సీ నోట్లు ఉండగా.. మిగతావి రూ.500, రూ.200 నోట్లు ఉన్నాయి. పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు, వెండి సామగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాత్రి 2 గంటల సమయంలో నగదును, ఆభరణాలను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.  

హవాలా నగదేనా? 
పోలీసులు స్వాదీనం చేసుకున్న నగదు హవాలా మార్గంలో తరలించేందుకు ఉన్నదేననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఓ కంపెనీలో డీజీఎంగా పనిచేసే వ్యక్తి ఇలా ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో నగదు ఇలా ఉంచుకుంటారా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. సాధారణంగా డబ్బు ఇంట్లో ఉండే చాలా భద్రంగా దాచుకుంటారు కానీ..  కేవలం బ్యాగుల్లో, అల్మారాలో నిర్లక్ష్యంగా దాచి ఉంచడంతో ఇవి ఎక్కడికైనా తరలించేందుకు దాచిపెట్టి ఉంటారని, తరచుగా ఇలా డబ్బు తరలించే వాళ్లే ఇలా ఉంచుతారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు భైరి శ్రీనివాస్‌కు ఫోన్‌ చేస్తే దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు తన వద్ద ఉన్నాయని వచి్చన తర్వాత అన్నీ చూపిస్తానని ముక్తసరిగా జవాబిచ్చారు. నగదును ఆదాయ పన్ను శాఖ అధికారులకు స్వాదీనం చేస్తామని, అన్ని రకాల పత్రాలు పరిశీలించిన తర్వాత సక్రమంగా సంపాదించినది అని తేలితే వారికి అప్పగిస్తారని ఇన్‌స్పెక్టర్‌ సాయి ఈశ్వర్‌గౌడ్‌ తెలిపారు. 
 
ఆది నుంచీ అనుమానాలే..  
భైరి శ్రీనివాస్‌ 10 ఏళ్లుగా ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. గత 6 ఏళ్ల క్రితం తాను ఉండే ఇంటితో పాటు పక్కనే ఉండే మరో ఇల్లు కొనుగోలు చేశారు. ఈ రెండు ఇళ్లు సుమారు రూ.3 కోట్ల విలువ చేస్తాయి. శ్రీనివాస్‌ స్వస్థలం అయిన వైజాగ్‌లో కూడా గత కొద్ది రోజుల క్రితమే విలువైన ఇల్లు నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. అనతికాలంలోనే కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఎలా సంపాదించారని స్థానికులు సందేహాలు వెలిబుచ్చుతున్నారు. హవాలా వ్యాపారం చేస్తున్నారా? అనే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)