Breaking News

భోజనం బిల్లు కట్టమంటే..ఇద్దరిపై లారీ ఎక్కించేశాడు!

Published on Fri, 09/26/2025 - 14:45

శ్రీకాకుంళం జిల్లా, కంచిలిలో  భోజనం బిల్లు చెల్లించాలని కోరిన హోటల్‌ యజమాని పట్ల ఓ లారీ డ్రైవర్‌ సైకోలా ప్రవర్తించాడు. లారీ ఎక్కించేసి దారుణంగా హతమార్చాడు. ఇదేంటని అడ్డుకున్న మరో వ్యక్తిని సైతం లారీతో తొక్కించి చంపేశాడు. ఈ ఘోరమైన ఘటన కంచిలి మండలం జలంత్రకోట గ్రామ కూడలి సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళ్తే..  
జాతీయ రహదారిపై సరుకులు రవాణా చేసే క్రమంలో జార్ఖండ్‌ నుంచి విశాఖపట్నంకు బయలుదేరిన కంటైనర్‌ లారీ బుధవారం రాత్రి కంచిలి మండలం జలంత్రకోట గ్రామ కూడలిలో జాతీయ రహదారి పక్కన దాబా హోటల్‌ వద్ద ఆగింది. డ్రైవర్‌ ఎబ్రార్‌ ఖాన్‌ భోజనం చేసి అక్కడే మద్యం తాగాడు. భోజనం బిల్లు రూ.200 చెల్లించాలని హోటల్‌ యజమాని ఎం.డి.అయూబ్‌(56) కోరగా అందుకు నిరాకరించాడు. గొడవపడి లారీ తీసుకొని వెళ్లిపోతుండగా యజమాని అడ్డుకున్నాడు. దీంతో అతన్ని ఢీకొట్టి పైనుంచి లారీ తీసుకెళ్లిపోయాడు. ఆ హోటల్‌కు రోజువారీ పాలు ఇచ్చి తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్న మధుపురం గ్రామానికి చెందిన పాల వ్యాపారి డొక్కర దండాసి(71) తాను నడుపుతున్న టీవీఎస్‌ ఎక్సెల్‌ వాహనంతో అడ్డుకున్నాడు. ఆయన్ను కూడా లారీతో తొక్కేసి పారి పోయాడు. ఈ ఘటనలో యజమాని, పాల వ్యాపారి అక్కడికక్కడే మృతిచెందారు. హోటల్‌ సిబ్బంది, స్థానికులు వెంబడించి బూరగాం వద్ద లారీని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మృతదేహాలకు సోంపేట ప్రభుత్వాసుపత్రిలో గురువారం ఉదయం  పోస్టుమార్టం నిర్వహించారు.  

వలస కుటుంబంలో విషాదం.. 
హోటల్‌ యజమాని ఎం.డి. అయూబ్‌ పదిహేనేళ్ల జార్ఖండ్‌ రాష్ట్రం చత్‌గల్‌ జిల్లా సత్‌గాం నుంచి 15 ఏళ్ల కిందట వలసవచ్చాడు. భార్య నసీమా బేగం, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)