Breaking News

మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు

Published on Sun, 05/19/2024 - 04:44

సుభాష్‌నగర్‌/ సాక్షి, హైదరాబాద్‌: ఓ భూ వివాదంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ మేడ్చల్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఆయన అల్లు డు.. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డిలపై శనివారం పేట్‌బషీరాబాద్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. జీడిమెట్ల డివిజన్‌ సుచిత్ర ప్రాంతంలో సర్వే నంబర్‌ 82, 83లో తనతో పాటు 8 మందికి ప్లాట్లు ఉన్నాయంటూ కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి తాత్కాలికంగా ప్రహరీని ఏర్పాటు చేశారు. 

ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి.. అనుచరులతో అక్కడికి చేరుకుని ప్రహరీని కూల్చివేశారు. ఆ భూమి తమదని, అక్కడ ప్రహరీ ఎలా ఏర్పాటు చేస్తారని శ్రీనివాస్‌రెడ్డి తదితరులతో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పేట్‌బషీరాబాద్‌ ఏసీపీ రాములు.. విచారణ అయ్యేంత వరకు ఎలాంటి నిర్మాణాలు, కూల్చివేతలు చేపట్టవద్దని సూచించడంతో ఎమ్మెల్యేలు పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగారు. 

మరోవైపు శ్రీనివాస్‌రెడ్డి అనుచరులు మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. మల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డిలను అదుపులోకి తీసుకుని పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించి కేసులు నమోదు చేశారు.

మా భూమిని ఆక్రమించారు.. 
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు. తమ అధీనంలో ఉన్న భూమిలోకి శుక్రవారం రాత్రి 300 మంది అక్రమంగా చొరపడి హద్దులను చెరపి, ఆక్రమణకు పాల్పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పాలనలో హైదరాబాద్‌ మరో బిహార్‌గా మారబోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డుకోవాల్సిన పోలీసులు అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారని విమర్శించారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)