Breaking News

తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు ఆత్మహత్య

Published on Mon, 07/03/2023 - 07:24

సాక్షి, అనంతపురం: తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం రాత్రి డ్యూటీ నుంచి ఇంటికి వెళ్లాక తలుపులు బిగించుకొని ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు.. సీఐ భార్యా, ఇద్దరు కూతుళ్ల నుంచి వివరాలు సేకరించిన తర్వాత మీడియాకు వివరాలు వెల్లడించారు.

తాడిపత్రి సీఐ ఆనందరావు మృతికి కుటుంబ కలహాలే కారణమని పేర్కొన్నారు. కొంత కాలం గా భార్యా భర్తల మధ్య విబేధాలు ఉన్నాయని.. నిన్న రాత్రి కూడా సీఐ ఆనందరావు దంపతుల మధ్య గొడవ జరిగిందని.. ఈ మనస్తాపం తోనే సీఐ ఆనందరావు బలవన్మరణానికి పాల్పడినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్పీ శ్రీనివాసరావు వివరించారు. 

ఎమ్మెల్యే పరామర్శ
తాడిపత్రి సీఐ ఆనందరావు మృతి పట్ల ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విచారం వ్యక్తం చేశారు. సీఐ కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం తెలిపారు.  ఆనందరావు మృతదేహానికి హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నివాళులు అర్పించారు. సీఐ ఆనందరావు మృతదేహం వద్ద ఎస్పీ శ్రీనివాసరావు పోలీసు లాంఛనాలతో నివాళులు అర్పించారు.
(చదవండి: పిడుగు పడి 11 మందికి గాయాలు)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)